Advertisementt

మహేష్ తర్వాత చరణ్ తోనే..!!

Mon 01st Jan 2018 01:24 PM
kiara advani,mahesh babu,bharath ane nenu,ram charan,boyapati  మహేష్ తర్వాత చరణ్ తోనే..!!
Kiara Advani in Ram Charan and Boyapati Movie మహేష్ తర్వాత చరణ్ తోనే..!!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న రంగస్థలం సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం వీకెండ్, మంత్ ఎండ్, ఇయర్ ఎండ్ ని ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ తన భార్యతో కలిసి దుబాయ్ వీధుల్లో చక్కర్లు కొడుతూ మంచు తో ఆడుకుంటున్నాడు.  రామ్ చరణ్ రంగస్థలం తరువాత తన తదుపరి సినిమాని బోయపాటి శ్రీను దర్శకత్వం లో చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రస్తుతం లుక్ చేంజ్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటి వరకు రామ్ చరణ్ రంగస్థలం కోసం గుబురు గెడ్డంతో దాదాపు 10 నెలలుగా ఉన్న చరణ్.. బోయపాటి సినిమాలో మాస్ లుక్ కి చేంజ్ అవుతాడని తెలుస్తుంది.

ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించేందుకు ముందు రకుల్ ప్రీత్ అన్నారు. ఆ తర్వాత అను ఇమ్మానుయేల్  ఫైనల్ అన్నారు... కానీ చివరికి బాలీవుడ్ హీరోయిన్ అయిన కైరా అద్వానీని ఫిక్స్ చేసాడట బోయపాటి. ఈ భామ ఇప్పటికే మహేష్ బాబు సరసన భరత్ అనే నేను మూవీ లో నటిస్తుంది. భరత్ అనే నేను సినిమా తరువాత కైరా తెలుగులో ఒప్పుకున్న రెండో మూవీ రామ్ చరణ్ దే అంటున్నారు.

ఇకపోతే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇకపోతే ఈ సినిమా జనవరి 19 నుంచి రాజస్థాన్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ చరణ్ ఇంకా బోయపాటి దర్శకత్వంలో వస్తున్న మొదటి సినిమా కావడం తో ఈ మూవీ పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. 

Kiara Advani in Ram Charan and Boyapati Movie:

Kiara Advani Got Second Chance in Tollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ