చిరంజీవి 151 వ చిత్రం సై రా నరసింహారెడ్డి మొదలు పెట్టినప్పటినుండి ఏదో ఒక విషయమై మీడియాలో హైలెట్ అవుతూనే వుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత. ఒక కమర్షియల్ డైరెక్టర్ అయిన సురేందర్ రెడ్డి ఈ చారిత్రాత్మక సై రా చిత్రాన్నిడైరెక్ట్ చేస్తున్నాడు. దేశంలోని పలు భాషల్లో విడుదల చెయ్యనున్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదలైనప్పటినుండి ఈ సినిమా టెక్నీకల్ టీమ్ దగ్గరనుండి నటీనటుల వరకు ప్రతి ఒక్క విషయంలో ఎవ్వరికి తెలియని... అసలు బయటకి రాని విషయాలు చాలానే ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి.
అందులో మొదటిది సై రా సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ బయటికి వెళ్ళిపోయి.. ఆ స్థానంలోకి రత్నవేలును తీసుకోవడం.. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ హ్యాండ్ ఇవ్వడం... ఇప్పటివరకు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో సై రా టీమ్ ఒక క్లారిటీకి రాకపోవడం.. అలాగే హీరోయిన్ నయనతార విషయంలో ఆమె ఇచ్చిన డేట్స్ అయిపోవడం.. కొత్త డేట్స్ కోసం ఆమెని సంప్రదించగా... నయన్ వేరే సినిమాల కమిట్మెంట్ తో సై రా టీంని హోల్డ్ లో పెట్టడం వంటి విషయాల మీద ఇప్పటివరకు సై రా టీమ్ నుండి ఎటువంటి సమాచారం లేదు. అలాగే.. అందులో కొన్ని గాసిప్స్ ఉన్నప్పటికీ మరికొన్ని మాత్రం పచ్చి నిజాలు.
ఇకపోతే ఇప్పుడు మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సై రా చిత్రం సెకండ్ షెడ్యూల్ కి సమాయత్తం అవుతున్న తరుణంలో.. ఇప్పటివరకు చిత్రీకరించిన సై రా షూటింగ్ మీద చిరు అసంతృప్తిగా ఉన్నాడనే న్యూస్ బయటికి వచ్చింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ మీద చిరు ఏమంత తృప్తిగా లేడని... అందుకే చిరంజీవి కాస్త కోపంగా ఉన్నాడనే టాక్ బయటికి అవచ్చింది. మరి ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు సురేందర్ రెడ్డిని సై రా ప్రాజెక్ట్ నుండి తప్పించి వేరే డైరెక్టర్ కోసం సై రా టీమ్ తో పాటే చిరు సెర్చింగ్ లో ఉన్నాడనే గాసిప్ మాత్రం మరింత హాట్ న్యూస్ గా ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. మరి ఇన్ని విషయాలు జరుగుతున్నాయంటే.. సై రా ప్రాజెక్ట్ విషయంలో నిజంగానే ఏదో జరుగుతుంది.. అదేమిటో సరిగ్గా క్లారిటీ మాత్రం లేదు.