Advertisementt

అతిలోకసుందరికి టాలీవుడ్‌ అంటే చిన్నచూపా!

Tue 02nd Jan 2018 12:30 PM
jhanvi kapoor,sridevi,kollywood,bollywood,tollywood,actress sridevi  అతిలోకసుందరికి టాలీవుడ్‌ అంటే చిన్నచూపా!
Sridevi Mindset on Tollywood అతిలోకసుందరికి టాలీవుడ్‌ అంటే చిన్నచూపా!
Advertisement
Ads by CJ

అతిలోక సుందరి శ్రీదేవి ఒకప్పుడు తమిళంతో పాటు తెలుగులో కూడా ఓ వెలుగు వెలిగింది. ఆమె టాప్‌స్టార్‌ కావడంలో టాలీవుడ్‌ది కూడా కీలక పాత్ర. ఆమెను మన దర్శకనిర్మాతలు, నాటి టాప్‌స్టార్స్‌ అందరూ ఎంతో ప్రోత్సహించారు. ఇక దేశవిదేశాలలో ఈమెకి ఉన్న అభిమానులు మరో నటికి లేరని చెప్పవచ్చు. తెలుగులో కూడా వర్మ, నాగార్జున, చిరంజీవి వంటి వారికి ఆమె ఎంతో సన్నిహితురాలు. కానీ ఆమె బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత కేవలం నాటి సూపర్‌స్టార్‌ కృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్‌ వంటి వారితోనే నటించింది. ఇక ఈమె పెద్ద కుమార్తె జాన్వికపూర్‌ని తెలుగులో నాగార్జున చిన్నకుమారుడు అఖిల్‌ మొదటి చిత్రంలోకి తీసుకోవాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

మరో వైపు అశ్వనీదత్‌తోపాటు చిరంజీవి కూడా 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సీక్వెల్‌ని గానీ, రీమేక్‌ని గానీ రామ్‌చరణ్‌ -జాన్వికపూర్‌లతో చేయాలని భావించారు. కానీ శ్రీదేవి మాత్రం మొదట కోలీవుడ్‌ ద్వారా తన కుమార్తెను పరిచయం చేయాలని భావించి ఆ తర్వాత బాలీవుడ్‌కే ఫిక్స్‌ అయింది. ఇక ప్రస్తుతం జాన్వి మరాఠి 'సైరత్‌'కి బాలీవుడ్‌ రీమేక్‌గా రూపొందుతున్న 'ధడక్‌' చిత్రంతో నటిస్తోంది. శ్రీదేవి కూడా బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత కూడా ఎక్కువగా కోలీవుడ్‌పై ఇంట్రస్ట్‌ చూపించిందే గానీ టాలీవుడ్‌ని పట్టించుకోలేదు.

చివరకు 'బాహుబలి'కి కూడా నో చెప్పి బాలీవుడ్‌లో 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌, మామ్‌' చిత్రాలతో పాటు విజయ్‌ నటించిన కోలీవుడ్‌ మూవీ 'పులి'లో నటించింది. ఇక విషయానికి వస్తే తాజాగా జాన్వికపూర్‌ని వెయిట్‌ తగ్గాలని కరణ్‌జోహర్‌తో పాటు 'ధడక్‌' దర్శకుడు కోరడంతో ఆమె ఆ పనిలో ఉంది. తాజాగా ఆమె టైట్‌ బనియన్‌, రోజ్‌ కలర్‌ లెగ్గీస్‌తో ప్రముఖ జిమ్‌ నుంచి బయటికి వచ్చి కారులో ఎక్కుతూ ఓ ఫొటోగ్రాఫర్‌కి స్మైల్‌ ఇచ్చిన పిక్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. జాన్వికపూర్‌ని తన రెండో చిత్రంగా కోలీవుడ్‌లోనే నటింపజేసి సౌత్‌ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని శ్రీదేవి సన్నద్దమవుతోందని తెలుస్తోంది. సో.. శ్రీదేవికి మాత్రం టాలీవుడ్‌ అంటే చిన్నచూపేనని అర్ధమవుతోంది.

Sridevi Mindset on Tollywood:

Sridevi Not Interest on Tollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ