Advertisementt

వరుణ్ తేజ్ కోసం సాయిధరమ్ కి అన్యాయం!

Wed 03rd Jan 2018 12:59 AM
chiranjeevi,sidelines,sai dharam tej,f2,varun tej  వరుణ్ తేజ్ కోసం సాయిధరమ్ కి అన్యాయం!
Varun Tej Replaces Sai Dharam Tej In F2 వరుణ్ తేజ్ కోసం సాయిధరమ్ కి అన్యాయం!
Advertisement
Ads by CJ

సాధారణంగా హీరో- హీరోకి పోటీ ఉండటం చూస్తాం. మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలా మంది హీరోస్ టాలీవుడ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీళ్ళ మధ్య పోటీ బాగా ఉంది. అంతమంది వచ్చినా మెగా ఫ్యామిలీ నుండి మెగా ఫ్యాన్స్ అండదండలు వాళ్లపై అలానే ఉంటాయి. దీంతో వాళ్ళ మధ్యే వాళ్ళకే కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. 

వరుణ్ తేజ్ ఫిదా మూవీ బ్లాక్ బస్టర్ అయినా పేరు మొత్తం సాయి పల్లవి ఎకౌంటు లోకి వెళ్లిపోయింది. అందుకు వరుణ్ తేజ్ కూడా హ్యాపీగా లేడు. మరో సినిమాతో తానేంటో నిరూపించుకోవటానికి ట్రై చేస్తున్నాడు. తన తర్వాత వచ్చిన సాయి ధరమ్ తేజ్ మంచి హిట్స్ తో సెటిల్ అయిపోవడం, మాస్ సినిమాలతో 25 కోట్లు ఈజీగా రాబట్టగలిగే రేంజ్ కి చేరుకోవడం వరుణ్ కి ఇబ్బందిగా మారింది.

అందుకే వరుణ్ తేజ్ కెరీర్ కి బూస్ట్ ఇచ్చే ప్రయత్నాలు తెరవెనుక జోరుగా సాగుతున్నాయని టాక్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ మల్టీస్టారర్ రాబోతుంది. ఇందులో వెంకీతో పాటు మరో కుర్ర హీరోకు సమానమైన పాత్ర ఉంది. దీనికోసం మొదట అనిల్.. సాయి ధరమ్ తేజ్ అనుకున్నారు. కానీ ఇంతలో లెక్కలు మారి సాయి ధరమ్ తేజ్ ప్లేస్ లో వరుణ్ తేజ్ ని రీప్లేస్ చేయాల్సిందిగా మెగాస్టార్ నుంచి అనిల్ కు రిక్వెస్ట్ అందిందట. కారణం ఆల్రెడీ సాయికి మంచి మార్కెట్ ఉంది. కాబట్టి ఇది వదిలేసినా నష్టం లేదని, వరుణ్ కి ఒక బలమైన హిట్ కావలసిన తరుణంలో ఇది తనకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పినట్టు టాక్. ఇది ఆల్మోస్ట్ ఓకే అయిపోయిందని ఫిలింనగర్ టాక్. అయితే ప్రకటన వస్తే తప్ప ఇది నిజమని నమ్మలేం.

Varun Tej Replaces Sai Dharam Tej In F2:

>Chiranjeevi Sidelines Sai Dharam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ