పవన్ కళ్యాణ్ - తివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అజ్ఞాతవాసి మరో తొమ్మిది రోజుల్లో అంటే జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే పవన్ అజ్ఞాతవాసి సినిమా టైటిల్ విడుదల దగ్గరనుండి ఈ సినిమా ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ కు ఫ్రీమేక్ అనే టాక్ వినబడుతుంది. ఆ సినిమా టైటిల్ లో అజ్ఞాతవాసితో పాటు ప్రిన్స్ ఇన్ ఎగ్జైల్ అని ట్యాగ్ లైన్ పెట్టినప్పటినుండి ఈ టాక్ కి మరింత బలం చేకూరింది. అయితే ఇప్పుడు ఇదే సమస్య కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే లార్గో వించ్ సినిమా ఆల్ ఇండియా లాంగ్వేజెస్ రీమేక్ రైట్స్ టీసీరిస్ వారు కొనుక్కున్నారు. కాబట్టి వారు అజ్ఞాతవాసి సినిమా విషయంలో ఎక్కడ పట్టు దొరికితే అక్కడ నొక్కెయ్యాలని చూస్తున్నారట.
అందులో భాగంగానే టీసీరీస్ కి సంబందించిన బాలీవుడ్ లో గట్టి లాయర్లు ఈ విషయమై రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సమస్యని చక్కదిద్దేదుకు పవన్ కి త్రివిక్రమ్ కి సహాయ పడేందుకు బాహుబలి భల్లాలదేవ రానా రంగంలోకి దిగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఎందుకంటే రానాకి టిసీరీస్ అధినేతలతో స్నేహసంబందాలతో పాటు బాలీవుడ్ సెలెబ్రిటీస్ తో కూడా స్నేహం కొనసాగిస్తున్నాడు. అయితే రానా టీసిరీస్ అధినేతలతో చర్చలు జరిపినా.. వారు మాత్రం ముందు మాకు సెన్సార్ స్క్రిప్ట్ ఇవ్వండి... దాన్ని చూశాక ఆ సినిమాకి మా సినిమాకి సంబంధం ఉందో లేదో చూస్తాం. మా సినిమాకి, మీ సినిమాకి సంబంధం లేకపోతే... లేదంటే మేము ఆ సినిమా హక్కులకు పే చేసిన డబ్బు ఇచ్చేసి ఆ హక్కులను కొనేసుకోండి అని చెబుతున్నారట.
మరి లాస్ట్ మినిట్ లో ఆ హక్కులు అంటే అది కోట్లు పలికే అవకాశం లేకపోలేదు. మరి ఇప్పుడది నిర్మాతలకు తలకి మించిన భారం అయినప్పటికీ.... రానా మాత్రం ఎలాగోలాగా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టాలని కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తుంది. చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుందో...?