Advertisementt

బన్నీ ఇంపాక్ట్ పవన్ ఫ్యాన్స్‌ పై బలంగా పడింది!

Wed 03rd Jan 2018 11:59 PM
naa peru surya naa illu india,allu arjun,pawan kalyan,fans,likes,dislikes  బన్నీ ఇంపాక్ట్ పవన్ ఫ్యాన్స్‌ పై బలంగా పడింది!
Pawan Kalyan Fans Likes Bunny Naa Peru Surya Naa Illu India Impact బన్నీ ఇంపాక్ట్ పవన్ ఫ్యాన్స్‌ పై బలంగా పడింది!
Advertisement
Ads by CJ

ఎప్పుడైతే పవన్‌ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి బన్నీ'చెప్పను బ్రదర్‌' అన్నాడో నాటి నుంచి పవన్‌ ఫ్యాన్స్‌, బన్నీ మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మరోవైపు బన్నీ కూడా కేవలం మెగాభిమానులపై ఎంత కాలం ఆధారపడతాం.. అనే ఉద్దేశ్యంతో తన ఓన్‌ ఫ్యాన్స్‌ని ఎంకరేజ్‌ చేస్తూ వస్తున్నాడు. ఈ మద్య ఆయన ఫ్యాన్స్‌ బన్నీ ఆర్మీ పేరుతో ఓ యూనిటీగా మార్పు చెందారు. ఇక పవన్‌ ఫ్యాన్స్‌ ఎంతగా బన్నీని టార్గెట్‌ చేస్తున్నప్పటికీ ఆయన నటించిన 'రేసుగుర్రం, జులాయి. సన్నాఫ్‌సత్యమూర్తి, సరైనోడు, డిజె' చిత్రాలు మిక్స్‌డ్‌ టాక్‌ సాధించినా చివరకు బ్లాక్‌బస్టర్స్‌గా నిలుస్తున్నాయి. 

ఇక పవన్‌ ఫ్యాన్స్‌ బన్నీ టీజర్సుకి, సినిమాలకి ఎంతగా నెగటివ్‌ ప్రచారం, సోషల్‌మీడియాలో సినిమా బాగాలేదని విస్తృతంగా ప్రచారం చేస్తున్నా వాటి వల్ల బన్నీ చిత్రాలకు మరింత ప్రమోషన్‌ లభించి, సాధారణ కంటెంట్‌ ఉన్న చిత్రాలు కూడా ఓ రేంజ్‌లో అదరగొడుతున్నాయి. ఇక ప్రత్యేకంగా 'డిజె' విషయంలో పవన్‌ ఫ్యాన్స్‌ ఒక్కసారి రెచ్చిపోయారు. ఆ చిత్రం టీజర్‌ యూట్యూబ్‌లో దర్శనమిచ్చిన మరుక్షణం నుంచే డిస్‌లైక్స్‌తో ఆటాడుకున్నారు. ఇలా ఈ చిత్రం టీజర్‌ మోస్ట్‌ డిస్‌లైక్స్‌ సాధించిన అతి పెద్ద టీజర్‌గా రికార్డు సృష్టించింది. 

ఇక తాజాగా బన్నీ నటించిన 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రం ఫస్ట్‌ ఇంపాక్ట్‌ రిలీజ్‌ అయింది. అయితే దీనికి కూడా పవన్‌ ఫ్యాన్స్‌ నుంచి డిస్‌లైక్స్‌ వస్తాయని అందరూ భావించారు. కానీ ఈ ఫస్ట్‌ ఇంపాక్ట్‌కి అనుకున్నంత వ్యతిరేకత రాలేదు. తాము ఎంతగా టార్గెట్‌ చేసినా బన్నీ ఊపు ఆగకపోవడం, పైగా అదే ప్లస్‌ పాయింట్‌గా మారడం, మరోవైపు పవన్‌ ఫ్యాన్స్‌ అందరూ ప్రస్తుతం తమ హీరో నటించిన 'అజ్ఞాతవాసి' ఫీవర్‌లో మునిగి ఉండటం.. ఇలా దీనికి పలు కారణాలు ఉండవచ్చు. 

మరోవైపు 'డిజె' ఉన్నంత సాదా సీదాగా ఈ 'నా పేరు సూర్య' ఫస్ట్‌ ఇంపాక్ట్‌ లేదు. బెస్ట్‌ ఇంప్రెషన్‌తో అందరినోటా దీనికి పాజిటివ్‌ రెస్సాన్నే వస్తోంది. సో.. దీని మీద కూడా రచ్చ చేస్తే తమ పరువు పోతుందని పవన్‌ ఫ్యాన్స్‌ భావించారో. లేక వారికి కూడా ఇది నచ్చిందో... పవన్‌ అభిమానులే అలిసిపోయి ఇక మనవల్ల కాదులే అనుకున్నారో తెలియదు గానీ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'ఫస్ట్‌ ఇంపాక్ట్‌ ప్రస్తుతం 1 లక్ష 65 వేల లైక్స్‌, 32వేల డిస్‌లైక్స్‌తో ఉంది. మరోవైపు గతంలో బన్నీ సాధించిన విజయాలలో 'జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి'ల క్రెడిట్‌ని పవన్‌ ఫ్యాన్స్‌ త్రివిక్రమ్‌కి ఇచ్చారు. 

ఇక 'రేసుగుర్రం, డిజె, సరైనోడు' విషయాలలో దిల్‌రాజు, అల్లుఅరవింద్‌, సురేందర్‌రెడ్డి, హరీష్‌శంకర్‌, బోయపాటి శ్రీను వంటి వారు వాటి వెనుక బలంగా ఉన్నారు. కానీ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' పరిస్థితి అది కాదు. దర్శకుడు కొత్తవాడైన వక్కంతం వంశీ, నిర్మాతలు కూడా పెద్దగా పేరు లేని లగడపాటి శ్రీధర్‌, నిర్మాతగా ఫెయిలైన నాగబాబు. సో 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా'ని బట్టి నిర్మాత, దర్శకుల పేరుతో కాకుండా బన్నీ సొంత రేంజ్‌ ఎంత అనేది ఈ చిత్రంతోనే తేలుతుందని చెప్పవచ్చు. 

Pawan Kalyan Fans Likes Bunny Naa Peru Surya Naa Illu India Impact:

Pawan Kalyan Fans Favour to Bunny Naa Peru Surya Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ