Advertisementt

‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి తర్వాత సినిమా..!

Thu 04th Jan 2018 08:09 PM
arjun reddy,sandeep vanga,crime thriller,mahesh babu  ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి తర్వాత సినిమా..!
Sandeep Reddy Vanga Next Film is Crime Thriller ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి తర్వాత సినిమా..!
Advertisement
Ads by CJ

 

గత ఏడాది అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. పెద్దగా పేరు లేని హీరో..కొత్త హీరోయిన్ ని పెట్టి తన సొంత బ్యానర్ లోనే తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి ఇండియా మొత్తం ఫేమస్ అయ్యాడు. గత ఏడాది బాహుబలి తర్వాత అంతటి పేరు అర్జున్ రెడ్డి సినిమాకు వచ్చింది.

దీంతో పెద్దపెద్ద నిర్మాతలు, హీరోస్ సందీప్ తో సినిమా చేయటానికి ఆసక్తితో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈవెన్ మహేష్ బాబు కూడా అతనితో వర్క్ చేయాలని అనుకుంటున్నాడు. అందుకు కథ కూడా రెడీ చేయమని మహేష్ నుండి ఓ మెసేజ్ కూడా వెళ్లిందని తెలుస్తోంది. 

అయితే  సందీప్ ఇంకా తన తర్వాతి సినిమాను కన్ఫమ్ చేయలేదు. దర్శకుడిగా తన రెండో సినిమాను క్రైమ్ థ్రిల్లర్‌గా మలుస్తున్నాడట సందీప్. ఇప్పటికే లైన్ కూడా ఒకే అయిందంట. ఈ సినిమాను ఓ  ప్రముఖ నిర్మాత నిర్మిస్తాడట. ఇంకా నటీనటులెవరన్నది ఖరారవ్వలేదు. కొన్ని నెలల్లో షూటింగ్ స్టార్ట్ చేసి.. 2019 లో ఈ సినిమాని విడుదల చేస్తారంట. తొలి సినిమా ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాను అందించేసరికి సందీప్ రెడ్డి పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తెలుగు దర్శకులకు ద్వితీయ విఘ్నం అనేది ఒకటి వెంటాడుతూ ఉంటుంది. మరి సందీప్ దాన్ని ఎలా అధిగమిస్తాడో చూడాలి. అలానే ప్రేక్షకులు కూడా సందీప్ ఎటువంటి సినిమా తీస్తాడో అని చూస్తున్నారు.

Sandeep Reddy Vanga Next Film is Crime Thriller :

Arjun Reddy Director Next Movie Confirmed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ