Advertisementt

మగాళ్లందరినీ అలా చూడొద్దు: నిత్యామీనన్!

Thu 04th Jan 2018 08:12 PM
nithya menen,parvathi,heroine,gents,heroes  మగాళ్లందరినీ అలా చూడొద్దు: నిత్యామీనన్!
Nithya Menen Supports Heroes మగాళ్లందరినీ అలా చూడొద్దు: నిత్యామీనన్!
Advertisement
Ads by CJ

మహిళా స్వేచ్చ, ఫెమినిజం వంటి వారికి ఒకొక్కరు ఒక్కో అర్ధం చెబుతారు. నిజానికి మనకి కావాల్సింది పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన స్వేచ్చ అంతేగానీ ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం మహిళల పక్షపాత చట్టాలు, రిజర్వేషన్లు అనేవి నిజమైన మహిళా స్వేచ్చను తేలేవు. ఇక మహిళలకు రాజకీయాలలో రిజర్వేషన్లు అంటున్నారు. కానీ ఎన్నికల్లో నిలబడేది ఆడవారే గానీ వెనుక పెత్తనం చేసేది మాత్రం భర్త, కొడుకులే. మరి దీని వల్ల మహిళా సాధికారికత ఎలా సాధ్యమవుతుంది? మరికొందరు మహిళాస్వేచ్చ అంటే పాశ్చాత్యపోకడలు, మగవారితో సమానంగా మద్యం, సిగరెట్లు, కురచ దుస్తులు, తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, దుస్తులు వేసుకోవడమే భ్రమలో ఉన్నారు. కానీ స్వేచ్చ, సమానత్వం అనేది మనసుకి సంబంధించిన విషయం. 

ఏ తప్పు లేకపోయినా అత్తామామల వంటి ముసలి వారిపై కోపంతో వేరు కాపురాలు పెట్టించడం, అటు భార్య, ఇటు తల్లి మద్య మగాడిని నిలిపేయడం.. ఇవేనా మహిళా స్వేచ్చ అంటే. నలుగురు అబ్బాయిలు కలసి ఓ అమ్మాయిని టీజ్‌ చేసినా, ర్యాగింగ్‌ చేసినా కఠిన శిక్షలు ఉన్నాయి. కానీ అదే నలుగురు పోకిరి అమ్మాయిలు ఒక అబ్బాయిని టీజ్‌ చేసి ఏడిపించినా, సెక్స్‌ వల్‌ హెరాస్‌మెంట్‌లు చేసినా అది తప్పు కిందకి రాదు. ఈ విషయంలో నిత్యమీనన్‌ భావాలు సూపర్‌ అనే చెప్పాలి, నటన, అందం విషయంలో, గ్లామర్‌షో విషయంలో కూడా కఠినంగా ఉంటూ, ఎంతో ప్రతిభ ఉన్న ఈమె ఏ తప్పు లేపోయినా అన్ని తప్పులను మగాళ్లపై నెట్టేస్తున్నారు. అనవసరంగా కొన్ని విషయాలలో మహిళలను వెనకేసుకుని వస్తున్నారు... అని అంటోంది. 

ఇటీవల మలయాళంలో ఆమె కోస్టార్‌ పార్వతి 'ఇండస్ట్రీలో మగాళ్లదే పెత్తనం. ఇక్కడ పురుషాధిక్యం నడుస్తోంది' అని చేసిన కామెంట్స్‌ సంచలనంగా మారాయి. వాటికి నిత్య తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. కేవలం సినిమాలలోనే కాదు... ఇళ్లు, ఆఫీసులు, ప్రతి రంగంలోనూ ఇది కామనే. మనల్ని మనం నిరూపించుకుని, మన అభిప్రాయం ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితిని మగాళ్లకి కలిగించాలి. అంతేగానీ ప్రతి విషయంలో పురుషాధిక్యం అని ఉపన్యాసాలిస్తే ఉపయోగం లేదని కుండ బద్దలు కొట్టింది. పనిగట్టుకుని మగాళ్లు ఆడాళ్లను ద్వేషిస్తారని నేను అనుకోను. సమాజం అలా ఉంది కాబట్టి అందరినీ మనం అదే కోవలోకి లెక్కేస్తున్నాం.. అంటూ చెబుతోంది. ఇక ప్రస్తుతం ఈమె భావ ప్రకటనా స్వేచ్చ అనే పాయింట్‌ మీద రూపొందుతున్న మలయాళ చిత్రం 'ప్రాణ'లో, నాని నిర్మాతగా రూపొందుతున్న 'అ' చిత్రంలో నటిస్తోంది. 

Nithya Menen Supports Heroes :

Nithya Menen's Shocking reply to Heroine Comments

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ