గతేడాది పవన్‌కళ్యాణ్ నటించిన 'కాటమరాయుడు' టీజర్ ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చి యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. కానీ ఆ తర్వాత వచ్చిన 'డిజె' చిత్రం ఆ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు పవన్ నటిస్తున్న 'అజ్ఞాతవాసి' టీజర్ ఓ దున్ను దున్నేసి, 24 గంటల్లో 64లక్షల వ్యూస్ సాధించి, దక్షిణాదిలో 'మెర్శల్'కంటే చాలా వెనుకబడి ఉన్నా కూడా రెండో స్థానంతో సరిపుచ్చుకుంది. ఇప్పుడు మరలా పవన్ రికార్డుకి బన్నీనే చెక్ పెట్టాడు. నూతన ఏడాది కానుకగా విడుదలైన 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైన 24 గంటలోనే 68 లక్షల వ్యూస్‌ని సాధించిన 29 గంటల్లో కోటి దాటి రికార్డును సెట్ చేసింది. కానీ దీనిపై బన్నీ అండ్ టీం, ఆయన అభిమానులు ఆచితూచి స్పందిస్తున్నారు.
ఆల్‌రెడీ బన్నీపై పవన్ అభిమానుల కోపం ఇంకా చల్లారిందో లేదో తెలియదు. ఇక 'డిజె' చిత్రం 'నాన్‌బాహుబలి' రికార్డులను కలెక్షన్లలో కొల్లగొట్టిందని ఇచ్చిన స్టేట్‌మెంట్ వల్ల 'ఖైదీనెంబర్ 150'ని కూడా దాటేసిందా? అని మెగాభిమానులు తెగ ఫీలైపోయారు. ఇక 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' ఫస్ట్ ఇంపాక్ట్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. బన్నీ లుక్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో అల్లుఅర్జున్‌కి తండ్రిగా నటిస్తున్న యాక్షన్ కింగ్ అర్జున్ పాత్ర మాత్రం రివీల్ కాలేదు. గతంలో యాక్షన్‌కింగ్ అర్జున్‌కి ఎన్నో చిత్రాలలో తండ్రి పాత్రలు వచ్చినా, 'సన్నాఫ్ సత్యమూర్తి'లో ఉపేంద్ర పాత్ర వచ్చినా ఆయన నో చెప్పాడు. మరి ఈ చిత్రానికి ఆయన ఓకే చెప్పాడంటే సమ్‌థింగ్ స్పెషల్ అనే చెప్పాలి.
ఇక 'నా పేరు సూర్య' విషయానికి వస్తే గతంలో ఎమ్మస్‌రెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి నిర్మాతలుగా రాజశేఖర్ హీరోగా వచ్చిన 'ఆగ్రహం' చిత్రం తరహాలో బన్నీ పాత్ర ఉంటుందని వార్తలు షికారు చేస్తున్నాయి. సాధారణంగా మన చిత్రాలలో మిలటరీ, పోలీస్ అధికారుల పాత్రలంటే ఒకే మూసలో ఉంటాయి. రాజశేఖర్ నటించిన 'ఆగ్రహం'లో ఆయన మిలటరీలో ఉంటూ సెలవులపై ఇంటికి వచ్చి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తాడు. దేశంకి బయటి దేశాల శత్రువుల కంటే లోపల ఉన్న శత్రువులే ప్రమాదకరం అని చెబుతాడు. ఓ సీన్‌లో నగ్నంగా కూడా కనిపిస్తాడు. ఇక 'ఎవడైతే నాకేంటి' కూడా అదో కోవలోకి వచ్చే చిత్రమే. మరి 'నా పేరు సూర్య' చిత్రం కథ, కథనాలు డిఫరెంట్‌గా ఉన్నా కూడా బన్నీ పాత్ర మాత్రం 'ఆగ్రహం' తరహాలోనే ఉంటుందని అంటున్నారు. ఇక వక్కంతం వంశీకి మొదటి చిత్రంతో అవకాశం ఇవ్వని ఎన్టీఆర్ సైతం ఈ ఫస్ట్ ఇంపాక్ట్ చూసి వక్కంతంను, బన్నీని మెచ్చుకున్నాడని తెలుస్తోంది. సో 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' హిట్ అయితే వెంటనే ఎన్టీఆర్‌తో వక్కంతం చిత్రం గ్యారంటీ అని చెప్పవచ్చు.