వన్ అఫ్ ది క్రేజీ కాంబినేషన్ సినిమా రామ్ చరణ్ - బోయపాటిల సినిమా. ఈ సినిమా ఓపెనింగ్ ముహూర్తం జరుపుకున్న విషయం తెలిసిందే. అంతా రెడీగానే వుంది. ప్రీ ప్రొడక్షన్స్ పనులు కూడా దాదాపు అయిపోయాయి. అయితే ఉన్నట్టు ఉండి తెరపైకి ఓ వార్త వచ్చి అందరిని ఆశర్యపరుస్తోంది. బోయపాటి - రామ్ చరణ్ సినిమా ఆగిపోయిందని.
రామ్ చరణ్ రంగస్థలం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మధ్యలో బోయపాటి సంగతులు మాత్రం బయటికి రావట్లేదు. అసలు ఏంటని ఆరా తీస్తే.. మైత్రి మూవీ మేకర్స్ సినిమా పట్టాలెక్కకముందే ప్యాక్అప్ చేశారని ఫిలింనగర్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందుకు కారణం రామ్ చరణ్ స్టోరీపై సంతృప్తిగా లేడంట.
నిజానికి బోయపాటి రామ్ చరణ్ కి చెప్పిన మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ కధే అంట. 'ధృవ', 'రంగస్థలం' లాంటి డిఫరెంట్ సినిమా చేసి మళ్ళీ రొటీన్ బాట పడితే.. తన కెరీర్ పైన ప్రభావం చూపే అవకాశం ఉందని.. అందుకే చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. సినిమా అటకెక్కినట్లే అని బలంగా వాదనలు వినిపిస్తున్నాయి.