Advertisementt

కత్తి అందర్నీ వాయిస్తున్నాడుగా..!!

Sat 06th Jan 2018 09:12 PM
kathi mahesh,counters,pan kalyan,balakrishna,poonam kaur  కత్తి అందర్నీ వాయిస్తున్నాడుగా..!!
Kathi Mahesh Targets also Balakrishna కత్తి అందర్నీ వాయిస్తున్నాడుగా..!!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ షో తో హైలెట్ అయిన కత్తి మహేష్ అక్కడ ఎలిమినేట్ అవగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద పంచ్ లు వేస్తూ తెగ హడావిడి చేస్తున్నాడు. పనిగట్టుకుని  పవన్ ని టార్గెట్ చేసిన కత్తి మహేష్ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైయ్యాడు. అయినా ఏ మాత్రం తగ్గకుండా పవన్ మీద ట్వీట్స్ వర్షం కురిపిస్తున్నాడు. ఇలా ఒకప్పుడు ట్వీట్ మహారాజుగా వెలిగిన దర్శకుడు వర్మ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశాడు. కానీ కత్తి అలా కాదు కేవలం పవన్ ని తాజాగా బాలకృష్ణ ని టార్గెట్ చేస్తున్నాడు. వైసిపి జగన్ నుండి వకాల్తా పుచ్చుకున్నట్టుగా వున్నాడు కత్తి. అందుకే పవన్ కళ్యాణ్ రాజకీయ, సినీ, పర్సనల్ జీవితాల గురించి తెగ విమర్శలు గుప్పిస్తూ ఛానల్స్ లో, సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాడు.

కత్తి మహేష్ ఎంతగా రెచ్చగొడుతున్న.. అనవసరంగా స్పందించి తన గౌరవాన్ని దిగజార్చుకొని పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు తనపై విమర్శలు చేస్తున్న వారికీ ఒక చిన్నపాటి ఆసక్తికర ట్వీట్ చేశాడు. అదేమిటంటే.. వ్య‌క్తిత్వంలో నిన్ను ఓడించ‌డం చేత‌కాని వాళ్లు.. నీ కులం, ధ‌నం, వ‌ర్ణం గురించి మాట్లాడ‌తారు అంటూ సున్నితంగా ట్వీట్ చేశాడు. తన గురించి విమర్శించిన ప్రతి ఒక్కరికి పవన్ సమాధానం అదే అన్నట్టుగా ఉందా ట్వీట్.

మరి పవన్ అలా ట్వీట్ చేశాడో లేదో ఇలా మహేష్ కత్తి లైన్ లో కొచ్చేసాడు. పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పిన కులం, డబ్బు గురించిన మాటలను నీ ఫ్యాన్స్ కి చెప్పు. నాకు కాదు. అలాగే వ్యక్తిత్వం గురించిన మాటలు నువ్వు మాట్లాడకపోతేనే బావుంటుంది.... అంటూనే పవన్ ఫ్యాన్స్, హీరోయిన్ పూనంకౌర్ తనని వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటూ ట్వీట్ చేసి పవన్ కి ఒక చిన్నపాటి ఛాలెంజ్ కూడా విసిరాడు. పవన్ కి దమ్ముంటే టీవీ 9 వేదికగా చర్చకు సిద్ధం కావాలని.. ఆ చర్చలో ఎటువంటి ప్రశ్నలకైనా తాను సమాధానం చెబుతానని సవాల్ విసిరాడు. మరి ఇప్పట్లో కత్తి కథ మాత్రం కంచికి చేరేలా కనబడడం లేదు.

Kathi Mahesh Targets also Balakrishna :

Kathi Counters on Pawan, Poonam Kaur and balayya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ