వాస్తవానికి కత్తిమహేష్ వంటి వారు బయటపడుతున్నారు గానీ తెలుగు ఇండస్ట్రీలో గీతాఆర్ట్స్ చేసే ఆగడాలకు బలైపోయిన జర్నలిస్ట్‌లు ఎందరో ఉన్నారు. కానీ వారు నోరు మెదపడం లేదు.గీతాఆర్ట్స్ కాంపౌండ్‌లో ఉండే స్వామినాయుడు నుంచి బన్నీ వాసు వరకు నేడు తమ హీరోలకు తప్పుగా ఎవరైనా మాట్లాడితే బౌతికంగా కూడా దాడులకు దిగుతున్నారు. నాడు రాజశేఖర్ తాను ప్రజారాజ్యం పార్టీని సమర్ధించనని చెప్పిన వెంటనే, ఆయన ఏ రైలు ఎక్కాడు? ఏ కారులో ప్రయాణిస్తూ తన ఇంటికి వెళ్తున్నాడు? వంటి విషయాలన్ని గీతాకాంపౌండే వారి అభిమానులకు, అరాచకమూకలకు తెలిపింది. దాంతో నాడు రాజశేఖర్‌పై దాడి జరిగింది.
ఇక నెల్లూరుకి చెందిన శతాబ్దాల చరిత్ర ఉన్న లాంగెస్ట్ లివింగ్ వీక్లీ పత్రిక అయిన 'జమీన్‌రౌతు' గురించి చాలా మందికి తెలుసు. నాడు ఆ పత్రికలో చిరంజీవి, అల్లుఅరవింద్, పవన్‌కళ్యాణ్‌లకు వ్యతిరేకంగా ఓ ఆర్టికల్ రాశారు. దానికి అల్లుఅరవింద్ కోపగించి లీగల్ నోటీసులు పంపాడు. అంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాత వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 100మంది అల్లరి మూకలు నెల్లూరు వచ్చి ఆ పత్రిక సంపాదకుడైన డోలేంద్రప్రసాద్‌పై అటాక్ చేయాలని భావించారు. కానీ ఆ విషయం ముందుగానే ఆ సంపాదకుడికి తెలిసిపోవడం, ఆయన కూడా సై అంటే సై అనడంతో నెల్లూరు లోకల్‌లో ఆయనకున్న పలుకుబడి ముందు ఆయన్ను తామేమీ చేయలేమని తెలుసుకుని మెగా ఫ్యాన్స్ వెళ్లిపోయారు. దాంతో డోలేంద్రప్రసాద్ మరుసటి ఎడిషన్‌లోనే సినిమా జర్నలిస్ట్‌లు లాగా, పొలిటికల్ జర్నలిస్ట్‌లు వెన్నెముక లేని వారు కాదని, దమ్ముంటే తనతో పోరాడాలని తెలిపాడు.
ఇక నాడు చిరంజీవికి సన్నిహితుడిగా పేరున్న 'నెంబర్ వన్' అనే సినీ వారపత్రిక సంపాదకుడు, పబ్లిషర్ అయిన బాలిరెడ్డిని మెగా ఫ్యాన్స్ చాలా హీనంగా కొట్టి ఆయన ఈ ఫీల్డ్‌ని వదిలిపోయేలా చేశారు. తాజాగా కత్తి మహేష్ విషయంలో అదే జరుగుతోంది. తాజాగా కత్తి మహేష్ మాట్లాడుతూ, తనకు సంబంధించిన ఫొటోలు, తనను బూతులు తిడుతూ, పందులతో పోలుస్తూ గీతాఆర్ట్స్ కాంపౌండ్ తనపై దాడి చేయిస్తోందని, చివరకు తన ఫోన్ నెంబర్‌ని కూడా గీతాఆర్ట్స్ కాంపౌండ్‌వారే పవన్ అభిమానులకు చేరవేశారని, ఇకనైనా అల్లు అరవింద్ ఇలాంటి పనులు ఆపాలని హెచ్చరించాడు. లేకపోతే తన రియాక్షన్ కూడా ఘాటుగా ఉంటుందని చెప్పాడు. సోషల్‌మీడియాలో కూడా గీతాఆర్ట్స్ కాంపౌండ్ కొందరిని ఎంచుకుని రగడ రగడలు సృష్టిస్తోంది. ఇక కత్తి మహేష్ ఈ విషయంలో ఇప్పటివరకు పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు? పెద్దల ముందు అది నిలబడదని పెట్టలేదా? అనే చర్చ కూడా సాగుతోంది.