Advertisementt

'జై సింహా' నిడివి ఎంతో తెలుసా?

Sun 07th Jan 2018 08:07 PM
balakrishna,jai simha,movie,run time locked,updates  'జై సింహా' నిడివి ఎంతో తెలుసా?
Jai Simha Movie Run Time Locked 'జై సింహా' నిడివి ఎంతో తెలుసా?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ - కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్లో రూపొందిన 'జై సింహా' సినిమా మరో వారాల్లోనే ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా వుంది. సెన్సార్ నుండి యూ/ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న'జై సింహా' సినిమా రన్ టైం ఎంతో తెలుసా?. ఈమధ్యన సినిమాలన్నీ దాదాపుగా 2.30 నుండి 2.45 నిమిషాల్లో.. అదికూడా ఇంటర్వెల్ తో కలుపుకుని లేపేస్తుంటే.. బాలకృష్ణ 'జై సింహా' మాత్రం ఇంటర్వెల్ సమయంతో కలుపుకుని దాదాపు 3 గంటలుగా ఫిక్స్ చేశారట. అసలు 'జై సింహా' సినిమా రన్ టైం మాత్రం 2.43 నిమిషాలుగా ఉంటుందని సమాచారం అందుతుంది.

అందులో ఇంటర్వెల్ తో కలుపుకుని మొత్తంగా 'జై సింహా' సినిమా 3 గంటలుగా చెబుతున్నారు. మరి ప్రేక్షకులకు మూడు గంటలు థియేటర్స్ కూర్చునే ఓపిక ఉంటుందా అంటే... నిడివి ఎక్కువైనా బోర్ కొట్టేలా 'జై సింహా' సినిమా ఉండదనీ .. అప్పుడే సినిమా అయిపోయిందా అనేలా ఉంటుందని చెబుతుంది చిత్ర బృందం. బలమైన కథ ఉండగా ప్రేక్షకుడు బోర్ ఫీల్ అయ్యేంత సీన్ ఉండదని చెబుతున్నారు. ఇంటర్వెల్ తరువాత వచ్చే బాలకృష్ణ - ప్రకాష్ రాజ్ కాంబినేషన్లోని సీన్స్ సినిమాకే హైలెట్ అని చెబుతున్నారు.  అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ హీరోయిన్స్ గా నయనతార, హరిప్రియ, నటాషా దోషీలు నటిస్తున్నారు.

ప్రకాష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కి కూతురుగా నయనతార నటిస్తుందట. ప్రకాష్ రాజ్ పాత్ర ఈ సినిమాకి ఎంత కీలకమో అలాగే నయనతార పాత్ర కూడా ఈ సినిమాకి అంతే ఆయువుపట్టు అని ఆ సినిమా నిర్మాత సి కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు. ఇక ఈ సినిమా ఫలితం ఏమిటనేది జనవరి 12 న తెలియనుంది.

Jai Simha Movie Run Time Locked:

Balakrishna Jai Simha Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ