మొదటి సినిమా డిజాస్టర్ అయినా.... రెండో సినిమా హలోతో పర్లేదు అనిపించుకున్నాడు అఖిల్. కానీ వసూల్ విషయంలో హలో సినిమా అట్టర్ ప్లాప్ అయింది. ఈ చిత్రానికి నాగార్జునకు 10 కోట్లకు పైగా నష్టం వచ్చిందని చెబుతున్నారు.
మొదటి సినిమాతో పాటు ఈసారి కూడా ఓవర్ బడ్జెట్ వల్లే అఖిల్‌కి ఫ్లాప్‌లు తగిలిందని ప్రచారం ఉంది. ఇంకా హీరోగా పరిచయమై అతని రేంజ్ ఏంటో తెలియకముందే అతనిపై నలభై కోట్ల పెట్టుబడి పెట్టడం సమంజసం అనిపించుకోదు. మొదటి సినిమా అఖిల్ కి చేసిన తప్పే రెండో సినిమా హలోకి కూడా చేశారు.
నాగార్జున మంచి సినిమాగా తీయించాడుగాని.. బడ్జెట్ విషయంలో తన క్యాలిక్యులేషన్ మిస్‌ఫైర్ అయింది. అఖిల్‌కి ఖచ్చితంగా జనాకర్షణ వుంది. నెమ్మదిగా మార్కెట్ పెంచుకోవడం కాకుండా సరాసరి స్టార్ ఇమేజ్ కోసం తపించడం వల్లే రెండుసార్లు చుక్కెదురైంది. ఈసారి చేసే సినిమాకన్నా బడ్జెట్ పరంగా కరక్ట్ లెక్క వేసుకుని సినిమా తీస్తే కనుక అఖిల్ నిలబడిపోవడం అంత కష్టమేం కాబోదు.