'అజ్ఞాతవాసి' బాక్సాఫీస్ వద్ద అలజడి సృష్టిస్తోంది. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ కి తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ న భూతో న భవిష్యతి అన్నట్టున్నాయి. బాహుబలి 2 చిత్రాన్ని చూడటానికి జనాలు ఎలా ఎగబడ్డారో.. అదే విధంగా 'అజ్ఞాతవాసి' సినిమాకి ఎగబడుతున్నారు.
కేవలం ప్రీమియర్స్‌కే తెలుగు రాష్ట్రాలలో 40 కోట్ల షేర్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌కి రెండు మిలియన్ల గ్రాస్ వసూళ్లు గ్యారెంటీ అని అక్కడి ట్రేడ్ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ చిత్రానికి 125 కోట్లు వసూల్ వస్తే కానీ ఈ సినిమాను హిట్ అని అనలేం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. అంత మొత్తం రాబట్టడం తేలికైన విషయం కాకపోయినా పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే సాధ్యమే అని అంటున్నారు.
డిజాస్టర్ టాక్ వస్తే తప్ప వసూల్ తగ్గుముఖం పట్టవని... యావరేజ్ టాక్ వచ్చినా ఈజీగా నాన్ బాహుబలి రికార్డులని సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సంక్రాంతికి అజ్ఞాతవాసితో పాటు రెండుమూడు సినిమాలు వున్నాయి. మరి వీటి మధ్య అజ్ఞాతవాసి ఎలా 125 కోట్లు కొడుతుందో చూడాలి.