Advertisementt

నాకు అందుకే అవకాశాలు తగ్గాయ్: నవదీప్‌!

Thu 11th Jan 2018 07:49 PM
hero navdeep,film chances,navdeep actor,back ground  నాకు అందుకే అవకాశాలు తగ్గాయ్: నవదీప్‌!
Hero Navdeep About His Movie Chances నాకు అందుకే అవకాశాలు తగ్గాయ్: నవదీప్‌!
Advertisement
Ads by CJ

తెలుగులో తేజ చిత్రం 'జై'తో పరిచయమయ్యాడు యంగ్‌ హీరో నవదీప్‌. కానీ ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్‌ చిత్రం అంటూ పెద్దగా లేవు. ఉన్నంతలో 'గౌతమ్‌ ఎస్‌.ఎస్‌.సి', 'చందమామ' చిత్రాలను మాత్రమే చెప్పుకోవాలి. ఇక ఈయనకు క్రమశిక్షణ లేకపోవడం, పెద్ద ప్లేబోయ్‌గా, అనుకోకుండా వచ్చిన సెలబ్రిటీ స్టేటస్‌ కారణంగా ఈయన వ్యసనాల వల్లనే ఈయన ఇండస్ట్రీలో సరైన స్థాయికి ఎదగలేదని అంటారు. ముఖ్యంగా ఆయనకు మెగా కాంపౌండ్‌ హీరోలతో బాగా సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. వారి మూలంగానే 'ధృవ'తో పాటు పలు చిత్రాలలో ఆయన చాన్స్‌లు పొందగలిగాడు. 

ఇక నాడు వి.యన్‌.ఆదిత్య సినిమా షూటింగ్‌ సమయంలో ఈయన వేధింపులు తట్టుకోలేక నాటి రస్నాబేబీ అంకిత ఏకంగా విదేశాలలో షూటింగ్‌ సందర్బంగా ఆత్మహత్యకు ప్రయత్నం చేసిందనే టాక్ కూడా ఉంది. ఇక ఈయన పేరు డ్రగ్స్‌ పేరు వినిపించిన ప్రతిసారి ప్రస్తావనకు రావడం గమనార్హం. కానీ వీటిలో ఒక్కటి కూడా నిజమనే వార్తలు బయటికి రాలేదు. ఇక మీకు బ్యాగ్రౌండ్‌ లేదు కాబట్టే మీకు సరైన అవకాశాలు రావడం లేదా? అనే దానిపై ఆయన స్పందిస్తూ సినిమా బ్యాగ్రౌండ్‌ ఉన్నవారికైతే మొదట్లో మూడు నాలుగు హిట్స్‌, లేదా ఫ్లాప్‌లు వచ్చినా వరుస అవకాశాలు ఉంటాయి. అలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చిన వారిలో మనకి రవితేజ, నాని వంటి వారే కనిపిస్తూ ఉన్నారు. ఇక నా విషయంలో అదొక్కటే కారణంకాదు. ఎవరైనా యంగ్‌ హీరోలకు వరుసగా కెరీర్‌ ప్రారంభంలో మంచి హిట్స్‌ వస్తాయి. ఉదయ్‌కిరణ్‌, నితిన్‌ వంటి వారికి మొదట్లో వరుస సక్సెస్‌లు వచ్చాయి. కానీ నా విషయంలో అలా జరగకపోవడం నేను ఎదగలేకపోవడానికి కారణంగా భావిస్తాను.. అని చెప్పుకొచ్చాడు. 

Hero Navdeep About His Movie Chances:

Navdeep about his Film Carrier

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ