ఇండియా మొత్తం ఓ భారీ చిత్రం కోసం వెయిట్ చేస్తుంది. అదే శంకర్ తెరకెక్కిస్తున్న అద్భుత సృష్టి '2.0'. బాహుబలి 2 తర్వాత ఇండియాలోనే అంతకంటే ఎక్కువ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ గత ఏడాదే అయిపోయింది. కానీ గ్రాఫిక్స్ పనులవల్ల రిలీజ్ కి ఆలస్యం అవుతోందని అందరికి తెలిసిన విషయమే.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయిపోగానే.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సెన్సార్ వర్క్స్ పూర్తవుతాయి. ఇకపోతే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా రన్ టైం..100 నిమిషాలు ఉండబోతోంది. నిజంగా ఇది ఆశ్యర్యమే అని చెప్పాలి. ఎందుకంటే శంకర్ సినిమాలు మూడు గంటలకు దగ్గరగా ఉంటాయి. తన సినిమాని తన మేజిక్ స్క్రీన్ ప్లే తో జనాలని సీట్స్ లో కూర్చోపెట్టగలడు. మరి శంకర్ కొత్త ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
ఇక సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల రజినీకాంత్ చెప్పిన సంగతి తెలిసిందే.