Advertisementt

నిజాన్ని నిజాయితీగా ఒప్పుకున్నాడు!

Sun 14th Jan 2018 06:13 PM
dasari arun kumar,rumours,sarainodu villain,lakshmi kalyanam,dasari narayana rao  నిజాన్ని నిజాయితీగా ఒప్పుకున్నాడు!
Dasari Arun Kumar About Sarainodu Villain Chance నిజాన్ని నిజాయితీగా ఒప్పుకున్నాడు!
Advertisement
Ads by CJ

దాసరి ఎందరో నటీనటులకు జన్మనిచ్చి, అపర బ్రహ్మలా పేరుపొందారు. మోహన్‌బాబు నుంచి శ్రీహరి, ఆర్‌.నారాయణమూర్తి వరకు, కోడిరామకృష్ణ నుంచి ఎందరో దర్శకులను ఆయన తయారు చేశారు, డైరెక్టర్లకు స్టార్‌డమ్‌ తెచ్చి, హీరోలు స్టార్‌ దర్శకులను తయారు చేయలేరు గానీ దర్శకులు స్టార్స్‌ని తయారు చేస్తారని ఓపెన్‌గా చెప్పేవాడు. ఇక రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, రవిరాజా పినిశెట్టి వంటి దర్శకుల పిల్లలు ఏదో ఒక రంగంలో, ఏదో ఒక భాషలో కనిపిస్తూంటారు. కానీ దాసరి.. నిర్మాతను చేయాలని భావించిన ఆయన పెద్దకుమారుడు ప్రభు, హీరోని చేయాలని భావించిన దాసరి అరుణ్‌కుమార్‌లు మాత్రం నిష్ప్రయోజకులయ్యారు. 

ఇక దాసరి అరుణ్‌ని హీరోగా నిలబెట్టేందుకు దాసరి 'గ్రీకువీరుడు, చిన్నా, ఆది విష్ణు'తో పాటు కనీసం సపోర్టింగ్‌, కీలక రోల్స్‌లోనైనా రాణించేలా చేయాలని 'కొండవీటి సింహాసనం' వంటి చిత్రాలతో ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఇక దాసరి నుంచి అందరు లబ్ది పొందిన వారేగానీ ఆయన బతికుండగానే ఆయన కొడుకుకు అవకాశాలిచ్చి, నిలబెట్టే యత్నం చేయని వారు ఇప్పుడు ఆయన కుమారుడిని పట్టించుకుంటారని భావించడం దండగే. ఇక అరుణ్‌లో హీరోకి కావాల్సిన లక్షణాలన్ని ఉన్నా కూడా ఆయన రాణించకపోవడానికి ఆయనకు కష్టం, శ్రమ, కృషి, పట్టుదల లోపమేనని కూడా అంటారు. 

ఇక తాజాగా దాసరి అరుణ్‌కుమార్‌ కూడా తన వైఫల్యంలో తనదే పాత్ర కానీ తన తండ్రి పాత్ర లేదని చెప్పాడు. ఇక 'సరైనోడు' చిత్రంలో మీకు ఆది పినిశెట్టి చేసిన విలన్‌ పాత్ర వచ్చిందట? నిజమా? అని అడిగితే ఆయన లేదని చెబుతున్నాడు. తనను ఎవ్వరూ సంప్రదించను కూడా లేదు. ఇక 'నిజం' చిత్రంలో కూడా గోపీచంద్‌ పాత్రని నన్ను మొదట పెట్టుకున్నారనే వార్తలు కూడా నిజం కాదు. కానీ కళ్యాణ్‌రామ్‌-తేజల దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మీకళ్యాణం'లో మాత్రం నేను నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల అది వీలుకాలేదు. నా పాత్రను అజయ్‌ పోషించాడని చెప్పుకొచ్చాడు. 

Dasari Arun Kumar About Sarainodu Villain Chance:

Dasari Arun Kumar Trashed The Rumours

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ