సెలబ్రిటీ హోదా రావడం అనేది కూడా అదృష్టమే. సెలబ్రిటీలుగా కోట్ల మందిలో క్రేజ్, గుర్తింపును తెచ్చుకోవడం కూడా పూర్వజన్మ సుకృతంగా భావించాలి. కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం తాము సామాన్యుల కంటే అతీతులనే భ్రమలో బతుకుతుంటారు. కొందరు కెరీర్ స్టార్టింగ్ స్టేజీలో తమ హోదాకి ఎంతో గౌరవం ఇస్తూ, గౌరవం ఇచ్చిపుచ్చుకుంటారు. కానీ అదే ఇంకాస్త స్టార్‌డమ్ వస్తే మాత్రం సెమీ గాడ్స్‌గా ఫీలయిపోతుంటారు. తమను ఆదరించి, ప్రోత్సహించిన వారినే కించపరుస్తూ ఉంటారు. నిన్నటి బాలకృష్ణ నుంచి నేటి అల్లుఅర్జున్ వరకు ఇది వర్తిస్తుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూతో పాటు ఇదే విషయాన్ని తన ఫ్యామిలీ హీరో అయిన అల్లుశిరీష్‌కి కూడా చిరంజీవి ఓ విషయం చెప్పిన సంగతిని మనం గుర్తుంచుకోవాలి.
అభిమానులు తమ అభిమాన హీరోని కలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వారికి ఎప్పుడో గానీ తాము అభిమానించే వారిని కలిసే అవకాశం రాకపోవచ్చు. కానీ అదే సమయంలో హీరోలు తమ అభిమానితో మాట్లాడి, ఓ ఫొటో దిగే ఛాన్స్ కోరితే ఇవ్వాలి. అవి అభిమానులకు జీవితాంతం తీపి జ్ఞాపకంగా మిగులుతాయి. ఆ అవకాశం మిస్ అయితే అది ఫ్యాన్స్ పొరపాటు కాదు.. హీరోలదే ఆబాధ్యత. తాము అభిమానించేవారికి తాము ఏమీ ఇవ్వకపోయినా కనీస పలకరింపైనా ఇవ్వాలి... అనేది చిరంజీవి తన సిద్దాంతంగా చెప్పుకొచ్చాడు. ఆ దారిలోనే ఆయన నడవడం, అభిమానులకు ఆయనిచ్చే ప్రత్యేకతే చిరంజీవిని మెగాస్టార్‌ని చేయడంలో, మన వాడు, అందరి వాడు... మనతో భలే మెలిగాడు అనే అభిమానం ఆయన సంపాదించుకున్నాడు. అందరూ ఈ మంచి రూట్‌ని ఫాలో అవ్వడం మంచిది.
ఇక విషయానికి వస్తే 'పెళ్లిచూపులు'తో హిట్ కొట్టినా కూడా 'అర్జున్‌రెడ్డి'తో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ సంపాదించిన హీరో విజయ్‌దేవరకొండ . ఈయన చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు, ప్రతి తెలుగువాడి ఆదరణ లభించింది. అయితే అతనిపై మాత్రం తెలంగాణ పవర్‌స్టార్ అనే ముద్ర పడే విధంగా కొందరు కామెంట్స్ చేయడం సమంజసం కాదు. ఈయన తాజాగా వరంగల్ ప్రజలను ఆకట్టుకున్నాడు. వరంగల్‌లోని మలబార్ జ్యూయలరీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆయన వరంగల్‌కి వచ్చి తన అభిమానులను ఉత్సాహపరిచాడు. తన సోదరుడు వరంగల్ అమ్మాయినే వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నాడని, తాను కూడా వరంగల్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అక్కడి వారిని ఉత్సాహపరిచాడు.
మొత్తానికి 'అర్జున్‌రెడ్డి' సినిమాతో, వి.హన్మంతరావు వంటి పెద్దలపై అనవసరంగా తన ఓవర్ యాటిట్యూడ్ చూపించుకున్న విజయ్‌దేవరకొండ భవిష్యత్తులో ఎదగాలంటే ఇలాంటి సంయమనం, సమయస్ఫూర్తి చాలా ముఖ్యమని చెప్పాలి. మరోవైపు ఈయన సినిమాలతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఆకట్టుకుంటుండంలో ఈయన తన ఫేమ్‌ని తదుపరి చిత్రాల ద్వారా కూడా నిలబెట్టుకుంటాడో లేదో వేచిచూడాల్సివుంది...!