ఏ ఫీల్డ్‌లో ఉండేవారు ఆ ఫీల్డ్‌లోని డైలీ అప్‌డేషన్స్, పొగడ్తలు, విమర్శలు అన్ని తెలుసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా సినీ, రాజకీయ, వ్యాపారరంగాలలోని వారికి ఎప్పుడు అప్రమత్తత అవసరం. సినిమా వారికి ప్రేక్షకులు ఎలా ఉన్నారు? వారి తెలివి ఏ స్థాయిలో ఉంది? ట్రెండ్ ఎలా నడుస్తోంది? పక్కా కమర్షియల్ చిత్రాలను ఆదరిస్తున్నారా? వైవిద్యానికి పెద్ద పీట వేస్తున్నారా? అనేవి తెలుసుకోవడం చాలా అవసరం. కానీ పవన్ వంటి వారు మాత్రం నేను ట్రెండ్‌ని ఫాలో కాను...ట్రెండ్‌ని సెట్ చేస్తాను... అనుకుంటూ ఉంటేే 'పులి, పంజాలు, సర్దార్'లు మాత్రమే వస్తాయి. ఇక తానెప్పుడో తయారు చేసుకున్నానని చెప్పి, ఆ కథను నేటితరంలో 'సర్దార్ గబ్బర్‌సింగ్'గా తీస్తే ఏమవుతుందో అందరికీ తెలిసిందే. ఇక ఈయన పెద్దగా సినిమాలు చూడనని, పెద్దగా విమర్శలు పట్టించుకోనని, చదవనని అదేదో గొప్పగా చెబుతాడు. అది ఎప్పుడు మంచి చేయదు. ఎప్పటికప్పుడు కనీసం తాను ఉన్న రంగంపైనైనా దృష్టి పెట్టడం అవసరం.
ఇక ఎప్పుడో విడుదలై సామాన్య నెటిజన్‌కి కూడా తెలిసిన 'ఫ్రెంచ్' చిత్రం కాపీ విషయం బహుశా పవన్‌కి తెలియకపోయి ఉండవచ్చు. ఎందుకంటే పవన్ పెద్దగా చిత్రాలు, అప్‌డేట్స్ ఫాలో కాడు. కానీ మరోవైపు త్రివిక్రమ్ మాత్రం ఏ భాషా చిత్రమైనా వెంటనే చూసేసి తనకేం కావాలో తెలుసుకుంటూ ఉంటాడు. ఇలా త్రివిక్రమ్ ట్రాప్‌లో పాపం పవన్ పడిపోయాడనిపిస్తోంది. ఇక ఓ చిత్రం ఫ్లాప్ అయితే ఆ ఎఫెక్ట్ ముఖ్యంగా దర్శకునిపై తదుపరి హీరోలపై ఉంటుంది. నిన్నటిదాకా ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ ఒక్క చిత్రం చేయాలని ఆశపడిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా 'అజ్ఞాతవాసి' చూసి షాక్ అయ్యారు. మా హీరో చిత్రమైనా మనసు పెట్టి చెయ్..లేకపోతే ఇక టాప్‌డైరెక్టర్ల లిస్ట్‌లో ఉండవంటూ త్రివిక్రమ్‌కి సలహాలతో కూడిన బెదిరింపులు ఇస్తున్నారు. మరోవైపు ఈమద్య ఎన్టీఆర్‌కాస్త బెటర్‌గానే నిర్ణయాలు, కథలు, దర్శకులను ఎంచుకుంటున్నాడు.
ఇక మరోవైపు 'అజ్ఞాతవాసి' కోసం పవన్ 30కోట్లు, త్రివిక్రమ్ 20కోట్లు రెమ్యూనరేషన్‌తీసుకున్నారని తెలుస్తోంది. 'సర్దార్' బయ్యర్ల కోసం 'కాటమరాయుడు', 'కాటమరాయుడు' కోసం 'అజ్ఞాతవాసి', 'అజ్ఞాతవాసి'కోసం మరో సినిమా చేసే నిరంతర పనిలో పవన్ ఉన్నాడు. మరి ఈచిత్రానికి వచ్చే భారీ నష్టాల దృష్ట్యా మరోసారి బయ్యర్లు నిరాహారదీక్షలు చేసినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. మరి ఈ దెబ్బనుంచి పవన్, త్రివిక్రమ్, రాదాకృష్ణలతో పాటు త్రివిక్రమ్‌తోనే తన హారిక హాసిని క్రియేషన్స్‌లో చిత్రాలు చేస్తానని, వేరొకరితో చేయనని చెప్పిన రాధాకృష్ణ మరోసారి ఎన్టీఆర్ చిత్రాన్ని ఇదే చిత్రం కొన్నవారికి ఇవ్వాల్సి రావచ్చు. ఎంతైనా త్రివిక్రమ్ కథ ఏ చిత్రం కాపీనో కాస్త ఎన్టీఆర్ ముందు జాగ్రత్తతో చూసుకోవాల్సిందే... తప్పదు...!