కథ మరియు స్క్రిప్ట్ రచయితగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించి తొట్టెంపూడి వేణు, తరుణ్ వంటి హీరోల దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున వంటి సీనియర్ హీరోలకి తన స్క్రిప్ట్స్ తో మంచి విజయాల్ని ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తరుణ్ హీరోగా నటించిన నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారుతూనే విజయాన్ని అందుకున్నాడు. తనలోని రచయిత తనలోని దర్శకుడిని డామినేట్ చేసే విధంగా నువ్వే నువ్వే లో విమర్శకులకు దొరికిపోయిన త్రివిక్రమ్ తన రెండవ చిత్రం అతడు తో ఆ ముద్ర చెరిపి వేసుకుని తనకి స్టార్ డైరెక్టర్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని ప్రూవ్ చేసుకున్నాడు.
నువ్వే నువ్వే నుంచి అ ఆ వరకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చిత్రాలలో ఖలేజా మినహా డిజాస్టర్స్ ఏమి కనిపించవు. ఖలేజా పేలవమైన క్లైమాక్స్ మరియు అప్పటి సగటు ప్రేక్షకుడి మైండ్ సెట్ కి అడ్వాన్స్డ్ కామెడీ టైమింగ్ కావటంతో సినిమా బెడిసికొట్టింది కానీ త్రివిక్రమ్ ఫేమ్ అయితే కోల్పోలేదు. తాజాగా విడుదలై పరాభవం చూసిన అజ్ఞాతవాసి చిత్రంతో మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఉన్న మినిమం గ్యారంటీ నమ్మకం ప్రేక్షకులలో సన్నగిల్లిపోయింది. ఫ్రెంచ్ చిత్ర కథని కాపీ కొడుతూ తెలుగు సినిమాకి అనుగుణంగా దాన్ని మలచడంలో ఘోర పరాజయం చెందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి ప్రాజెక్ట్ ఎలా హేండిల్ చేస్తాడో అనే భయం తారక్ అభిమానులని వెంటాడుతుంది.
ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తో బ్రేక్ ఈవెన్ కానీ జై లవకుశ కారణంగా చాలా నిరుత్సాహం లో ఉన్న తారక్ అభిమానులకి అజ్ఞాతవాసి చిత్ర ఫలితం మరింత ఆందోళనకి గురి చేస్తుంది. కానీ ఒక్క చిత్ర ఫలితంతో దర్శకుడి ప్రతిభని నిర్ణయించలేం. తారక్ సినిమాతో త్రివిక్రమ్ తన పూర్వ వైభవం పుణికి పుచ్చుకునే అవకాశాలు మెండుగా వున్నాయి కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సి.