'సొంతం' చిత్రంతో దక్షిణాదికి హీరోయిన్‌గా పరిచయమై, తర్వాత 'భైరవి' అనే స్క్రీన్‌నేమ్‌తో వెంకటేష్ సరసన 'జెమిని'లో నటించి, తర్వాత కోలీవుడ్‌కి వెళ్లి అక్కడి మాస్ ప్రేక్షకుల్లో హీరోలకు సరిసమానమైన ఇమేజ్‌ని తెచ్చుకున్న ముద్దుగుమ్మ నమిత. ఇక ఈమెకి ఖుష్బూ తర్వాత తమిళంలో అంతటి పేరు వచ్చింది. తన భారీ అందాలతో, బొద్దుగుమ్మగా అలరించిన ఈమె ఫొటో పోస్టర్‌పై కనిపించిందంటే చాలు జనాలు థియేటర్ల వద్ద క్యూ కట్టారు.
ఇక విషయానికి వస్తే చాలా ఏళ్ల కిందట ఓ సెలబ్రిటీతో ఎలాగైనా వీకెండ్‌ని ఎంజాయ్ చేయాలని, ఓ నలుగురు విభిన్న మనస్తత్వాలు, బిన్నమైన బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చిన కుర్రాలు ఓ సినీ నటిని కిడ్నాప్ చేసిన కథతో సిల్క్‌స్మిత హీరోయిన్‌గా 'పారిపోయిన ఖైదీలు' అనే చిత్రాన్ని వల్లభనేని జనార్ధన్ అనే దర్శకుడు సినిమాగా తీశాడు. ఇలాంటి సంఘటనే నమిత జీవితంలోకూడా జరిగింది. ఆమె తమిళులకు ఆరాధ్యదేవతగా మారిన తర్వాత ఓ షో నిమిత్తం ఈమె తమిళనాడులోని తిరుచ్చికి తన మేనేజర్ జాన్‌తో కలిసి వెళ్లింది. ఎయిర్‌పోర్ట్‌లో దిగి బయటకు వస్తే కారులో ఒక వ్యక్తి వచ్చి కూర్చొండి మేడమ్ అన్నాడు. దాంతో అది ఆ షో నిర్వాహకులు పంపిన కారు అని ఆమె భావించి కారులో తన మేనేజర్‌తో సహా ఎక్కింది. ఈమె ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని కారులో బిజీగా ఉండగా, ఈమె మేనేజర్ తనకు తెలిసిన వారితో ఫోన్‌లో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు. కారు వారు అనుకున్న షో జరిగే దారికాకపోవడంతో దీనిని గ్రహించిన నమితకు అద్దంలో డ్రైవింగ్‌పై దృష్టి పెట్టకుండా మిర్రర్ నుంచి తననే చేస్తున్న డ్రైవర్ కనిపించాడు.
కుర్రాడు ఏదో హ్యాపీగా ఫీలవుతున్నాడని ఆమె కూడా మౌనంగా ఉంది. కానీ కారు వేరే మార్గంలో వెళ్లుతోందని గుర్తించిన ఆమె మేనేజన్ జాన్ వెంటనే నిర్వాహకులకు మెసేజ్ పెట్టాడు. వారు మీ కోసం మా కారు డ్రైవర్ ఎయిర్‌పోర్ట్ వద్ద వెయిట్ చేస్తున్నాడని చెప్పడంతో జాన్ షాక్ తిన్నాడు. వారి కారుని మరో ఆరేడు కార్లు వెంబడించడం, వారు ఓ గోడౌన్‌లోకి తీసుకెళ్లి నమితను వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుసుకున్నాను. ఇంతలో సడన్‌గా కారు ఆగింది. ఓ ముగ్గురు నలుగురు మహిళా కానిస్టేబుల్స్ కారు ఆపి ఆమెని కారులోంచి దించి మరో కారులోకి ఎక్కించారు. దీని గురించి నమిత చెబుతూ.. అప్పుడు నాకేం జరుగుతోందో అర్ధం కాలేదు. మా మేనేజర్‌ని అడిగితే మీరు కిడ్నాప్ అయ్యారు మేడం అని చెప్పాడు. నాకైతే నమ్మశక్యంకాక నవ్వు వచ్చిందని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ కిడ్నాప్ స్టోరీ సినిమా స్టోరీ కంటే ఇంట్రస్టింగ్‌గా ఉంది.