Advertisementt

ఓ సామాన్యుడిలా ప్రవర్తించిన సూర్య..!

Wed 17th Jan 2018 01:55 AM
suriya,gang,theater gate,rajahmundry,jump,menaka theater  ఓ సామాన్యుడిలా ప్రవర్తించిన సూర్య..!
Suriya Jumped The Theater Gate ఓ సామాన్యుడిలా ప్రవర్తించిన సూర్య..!
Advertisement
Ads by CJ

మన హీరోలు ఎక్కడికైనా వెళ్లితే అక్కడ పోలీసుల హంగామా, బౌన్సర్ల హడావిడి ఉంటుంది. మరికొందరు అభిమానులు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా రెచ్చిపోతారు. ఈ విషయంలో తమిళస్టార్‌ సూర్య మాత్రం తాను మిగిలిన అభిమానులకంటే భిన్నమని మరోసారి నిరూపించుకున్నాడు. తాజాగా ఆయన విఘ్నేశ్‌శివన్‌ దర్శకత్వంలో వచ్చిన 'తానా సేంద్ర కూట్టం' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈచిత్రం తెలుగులో 'గ్యాంగ్‌'గా సంక్రాంతికి విడుదలైంది. ఈ చిత్రం కోసం తమిళంతో పాటు తెలుగులో కూడా సూర్య భారీ ప్రమోషన్స్‌ నిర్వహించాడు. 

ఇక ఈ చిత్రం కోసం ఆయన రాజమహేంద్రవరం చేరుకుని అక్కడ ఈ చిత్రాన్ని థియేటర్‌లో కాసేపు వీక్షించి, అభిమానులతో ముచ్చటించాడు. ఇక సూర్య రాకను తెలుసుకున్న పలువురు ఆయన ఉన్న థియేటర్‌ వద్దకు భారీగా తరలివచ్చారు. బయటికి వస్తూ అభిమానులు తాకిడి బాగా ఉండటం గమనించిన సూర్య వెనుక గేట్‌ నుంచి థియేటర్‌ బయటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. 

కానీ అక్కడ తాళాం వేసి ఉండటం గమనించిన ఆయన ఓ సామాన్యుడిలా గేట్‌ ఎక్కి దాని నుంచి దూకి తన కారులో హైదరాబాద్‌కి వెళ్లిపోయాడు. ఈయన అలా ఓ సాధారణ వ్యక్తిగా గేట్‌ దూకడం చూసిన అభిమానులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. ఇలా సూర్య మరోసారి తనది డౌన్‌ టు ఎర్త్‌ మనస్తత్వమని నిరూపించుకున్నాడు. 

Suriya Jumped The Theater Gate:

Suriya Surprised Fans in Rajahmundry  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ