Advertisementt

రెజీనా రాత మారుతుందా.. 'అ!'..!!

Wed 17th Jan 2018 02:26 AM
regina,awe movie,negative role,regina awe movie  రెజీనా రాత మారుతుందా.. 'అ!'..!!
Actress Regina Hopes on AWE Movie రెజీనా రాత మారుతుందా.. 'అ!'..!!
Advertisement
Ads by CJ

మీడియం బడ్జెట్ సినిమాల హీరోయిన్ గా మోస్తరు విజయాల్ని అందుకోవటంతో పాటు మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సరసన 'పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' వంటి రెండు విజయవంతమైన చిత్రాలలో నటించి మంచి ఫేమ్ సంపాదించిన రెజీనా కాసాండ్రా 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో డైరెక్టర్ గా మారిన యాక్టర్ శ్రీనివాస్ అవసరాల చేసిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా 'జ్యో అచ్యుతానంద'తో కూడా బాగా ఆకట్టుకోగలిగింది. కానీ అమ్మడు 2017 లో తెలుగు ప్రేక్షకులని మెప్పించే చిత్రం ఒక్కటి కూడా ఇవ్వలేకపోయింది. తమిళ చిత్రం 'మానగరం' తెలుగు అనువాద రూపంగా వచ్చిన నగరం, కృష్ణవంశీ తెరకెక్కించిన 'నక్షత్రం', నారా రోహిత్ సరసన కథానాయికగా చేసిన 'బాలకృష్ణుడు' వరుసగా బాక్సాఫీస్ డిజాస్టర్స్ కావటంతో 2017 రెజీనాకి మర్చిపోలేని చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

ఈ ఏడాదిలోనైనా తన చిత్రాలతో ప్రేక్షకులని మెప్పిస్తూ బాక్సాఫీస్ హిట్స్ అందుకోవాలని తపన పడుతున్న రెజీనా.. రాబోతున్న 'అ!' చిత్రం పైనే హోప్స్ పెట్టుకుని నిరీక్షిస్తుంది. కాఫీ షాప్ లో పనిచేసే యువతిగా కనిపించబోయే ఈ చిత్రంలో మాదక ద్రవ్యాల వ్యసనం బారిన పడి మారిపోయే తన పాత్రలో వివిధ వేరియేషన్స్ ప్రదర్శించి చాలా కాన్ఫిడెంట్ గా ఉందట రెజీనా. మరి 'అ!' చిత్రం రెజీనా భవిష్యత్ ని ఎలాంటి మలుపు తిప్పుతుందో త్వరలోనే తేలనుంది.

Actress Regina Hopes on AWE Movie:

Regina playing Negative Role in the movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ