Advertisementt

పవన్‌ 'చరిత్ర' గురించి ఏం చెబుతాడో..!

Thu 18th Jan 2018 06:26 PM
pawan kalyan,charitra,next movie,am ratnam  పవన్‌ 'చరిత్ర' గురించి ఏం చెబుతాడో..!
One More Film From Pawwan పవన్‌ 'చరిత్ర' గురించి ఏం చెబుతాడో..!
Advertisement
Ads by CJ

'అజ్ఞాతవాసి' వంటి డిజాస్టర్‌ని మూటగట్టుకుని పవన్‌ పూర్తిగా రాజకీయాలలోకి వెళ్లినా ఆయనకు ఆ లోటు కనిపిస్తూనే ఉంటుంది. ఆయన అభిమానులు కూడ ఏదో వెలితిగా ఫీలవుతారు. దీంతో పవన్‌ నటించిన పీఎస్‌పీకే 25 'అజ్ఞాతవాసి' మాత్రమే అతనికి ఎన్నికల ముందు వచ్చే చివరి చిత్రం కాదని అర్ధమవుతోంది. మరోవైపు 'అజ్ఞాతవాసి'కి త్రివిక్రమ్‌, పవన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ... ఎన్నికల ముందు పవన్‌ నటించే చివరి సినిమా ఇదే, పవన్‌ 25 వ చిత్రం అంటూ భారీగా హైప్‌ క్రియేట్‌ అయింది. దాంతో ఈ చిత్రం థియేటికల్‌ రైట్స్‌ బిజినెస్‌ మాత్రమే 125 కోట్లకు పైగా జరిగింది. మొదటి రోజు 40 కోట్లు షేర్‌ తెచ్చినా, రెండో రోజు కేవలం 5 కోట్లకు పడిపోయింది. వీకెండ్‌ అయ్యే సమయానికి కేవలం 50 కోట్ల షేర్‌ మాత్రమే రాబట్టింది. దీంతో పవన్‌ , త్రివిక్రమ్‌లు తమ రెమ్యూనరేషన్‌లో సగం తిరిగి ఇవ్వడానికి రెడీ అయ్యారని సమాచారం. ఆ విధంగా చూసుకున్నా పవన్‌ రెమ్యూనరేషన్‌ అయిన 30కోట్లలో సగం అంటే 15కోట్లు, త్రివిక్రమ్‌ రెమ్యూనరేషన్‌లో సగం అంటే 10కోట్లు.. మొత్తంగా నిర్మాతకు 25కోట్లు వెనక్కి వస్తాయి. ఇంకా ఆయన డిస్ట్రిబ్యూటర్లకు న్యాయం చేయాలంటే కనీసం 50కోట్లకు పైగా కావాలి. మరి రాధాకృష్ణ ఆ మొత్తాన్ని సెటిల్‌ చేస్తాడా? లేక డిస్ట్రిబ్యూటర్లకు హ్యాండ్‌ ఇస్తాడా? లేక ఎన్టీఆర్‌తో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ద్వారా వచ్చే చిత్రాలను తక్కువ రేట్లతో డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చి వారిని ఆదుకుంటాడా? అనేది చూడాలి.

ఇక ఇంతవరకు మహేష్‌ 'బ్రహ్మోత్సవం, స్పైడర్‌'లే పెద్ద డిజాస్టర్స్‌గా పేరు తెచ్చుకోగా, పవన్‌ 'అజ్ఞాతవాసి' చిత్రం ఆ రికార్డును బ్రేక్‌ చేసి తెలుగులో అత్యధిక నష్టాలు తీసుకొచ్చిన ప్రాజెక్ట్‌గా నిలిచింది. తదుపరి పవన్‌ నటించబోయే చిత్రం ఏమిటనేది? ఆసక్తికరంగా మారింది. నీసన్‌ దర్శకత్వం ఏయం రత్నంతో 'వేదాళం' రీమేక్‌ చేస్తాడని వార్తలు వచ్చాయి. మరోవైపు ఆయన మైత్రి మూవీమేకర్స్‌తో సంతోష్‌ శ్రీనివాస్‌లో చేస్తాడని కూడా అంటున్నారు. మొత్తానికి రత్నం చిత్రానికి నీసన్‌ అయినా, మైత్రిమూవీస్‌కి సంతోష్‌ శ్రీనివాస్‌ అయినా కూడా ఈ కాంబినేషన్స్‌, దర్శకుల ఎంపిక పెద్దగా క్రేజీగా తేలేవు.

ఇక పవన్‌తో 'ఖుషీ' చేసుకుని, తర్వాతి చిత్రానికి బొక్కబోర్లా పడి, ఆ తర్వాత పవన్‌తో 'సత్యాగ్రహి' నిర్మిస్తానని చెప్పి, ఆర్ధిక నష్టాలలో ఉన్న రత్నంకి ఇది టఫ్‌ పీరియడేనని అర్ధమవుతోంది. ఇక రత్నంతో చేయబోయే చిత్రానికి 'చరిత్ర' అనే టైటిల్‌ని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇదైనా పవన్‌, రత్నంల 'గత చరిత్ర'లను మర్చిపోయేలా చేస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది..!

One More Film From Pawwan:

Pawan Kalyan Next Movie Title Is Charitra

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ