పవన్ ఫ్యాన్స్‌పై విరుచుకుపడుతున్న కత్తిమహేష్‌కి సపోర్ట్‌గా రాంగోపాల్ వర్మ నిలిచాడు. దానికి కృతజ్ఞతగా అన్నట్లు వర్మ తీస్తున్న 'గాడ్ సెక్స్ అండ్‌ట్రూత్'ని, అందులో నటించిన అమెరికన్ పోర్న్‌స్టార్ మియా మల్కోవా, సంగీతం అందిస్తున్న కీరవాణిలపై కత్తి మహేష్ ప్రశంసల వర్షం కురిపించాడు. దీంతో కత్తి, పవన్‌ల వివాదంలోకి అనవసరంగా తలదూర్చి పవన్‌సార్.. నన్ను కాపాడండి అని వేడుకునే దాకా తెచ్చుకుంది నటీ పూనమ్‌కౌర్.
తాజాగా వర్మ 'గాడ్ సెక్స్ అండ్‌ట్రూత్' విషయంలో ఆమె స్పందిస్తూ , 'భారతదేశంలో మామూలు ఆడవారి కంటే పోర్న్‌స్టార్‌లకే ఎక్కువ గౌరవం, మంచి జీవితం లభిస్తున్నాయి. సాధారణ మహిళలు దేనిపైనైనా స్పందించినా, పోరాడినా, మాట్లాడినా వారిని బలిపశువుల్లా మార్చుతూ అసభ్యంగా మాట్లాదుతూ, టార్గెట్ చేస్తున్నారు. అలాంటి మహిళల ఆత్మ, మనసు, శరీరాన్ని సమాధి చేసేందుకు సిద్దమవుతున్నారని' చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయినా పూనమ్‌కౌర్ తనకి జరిగిందని ఆవేదన చెందుతున్న అవమానం విషయంలో తానే అందరు మహిళలకు ప్రతినిధిలా మారి... ఇలా అందరికీ వర్తించేలా మాట్లాడటం మాత్రం సరికాదనే చెప్పవచ్చు.
ఇక దీనిపై వర్మ స్పందిస్తూ ఇది కత్తిమహేష్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావని భావిస్తున్నానని, తాను తీసేది ఇష్టం ఉంటే చూడవచ్చు. లేకపోతే చూడకుండా ఉండవచ్చు. అది ప్రేక్షకుల నిర్ణయం. ఇక నేను ఫోన్ నుంచి వాట్సాప్ మెసేజ్‌లు పెడుతూఉంటానే గానీ నిజమైన మెసేజ్‌లను తన చిత్రాల ద్వారా మాత్రం ఇవ్వనని సెటైరిక్‌గా స్పందించాడు.