పవన్ ఫ్యాన్స్‌కి, ఫిల్మ్‌క్రిటిక్ కత్తిమహేష్ కి వచ్చిన వివాదంకి కొంత ప్రత్యేకత ఉంది. అది కేవలం కత్తిమహేష్ మీద కావాలని కుట్ర చేసి, ఆయనను వేధించిన చర్యగా మాత్రమే అందరూ చూస్తున్నారు. కానీ నేడు కత్తిమహేష్ విషయంలో వ్యవహరించినట్లే భవిష్యత్తులో మనమీద ఎందుకు దాడులు చేయరు? అనే యూనివర్శల్ పాయింట్ ఇందులో ఉంది. కత్తి మహేషే కానక్కర్లేదు. ఆయన స్థానంలో ఎవరు పవన్‌పై విమర్శలు చేసినా పవన్ అభిమానులు దాడులకు పాల్పడే వారు. ఇక ఈ విషయంలో చాలా రోజుల కిందట కత్తి మహేష్ ఒక నిజం చెప్పాడు. ఆయనకు హైపర్ ఆదికి మధ్య చెలరేగిన వివాదం సందర్భంగా ఓ ప్రీమియర్‌షోలో హైపర్ ఆది, కత్తిమహేష్‌లు ఫొటోలుదిగి చివరకు మేము మేము ఒక్కటే... మీరే వెధవలు అవుతారు అని అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. ఇది నేడు నిజమైంది.
పవన్ ఫ్యాన్స్ తన మీద దాడి చేశారని ఆయన మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మరోవైపు కత్తి తాము సారీ చెబుదామని ప్రయత్నించినా నో అన్నాడని దాంతో ఆయనపై తమ నిరసనను వ్యక్తం చేయడానికే కోడిగుడ్లతో దాడి చేశామని ఇద్దరు యువకులు మీడియా ముందుకు వచ్చారు. ఇక ఛానెల్‌లో రాంకీ కూడా కత్తి మహేష్‌ని ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరితే కత్తి ససేమిరా అన్నాడు. తీరా చర్చ తర్వాత నేరుగా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి పవన్ అభిమానులపై కేసును ఉపసంహరించుకున్నాడు. ఇక పవన్ అభిమానులతో కలిసి కత్తిమహేష్ ఓ పార్టీని కూడా చేసుకున్నారు. దీని ఫొటోను, కోనవెంకట్ చేసిన ట్వీట్‌ని చూస్తే పవన్ అభిమానులు, కత్తి మహేష్‌లు ఒకటయ్యారని అర్ధమవుతోంది.
కోన తన ట్వీట్‌లో 'ఇప్పటికైనా వివాదానికి ముగింపు ఇచ్చినందుకు కత్తికి కృతజ్ఞతలు. నీ కెరీర్ బాగుండాలి. ఇకపై నీపై ఎవ్వరూ దూషణలకు పాల్పడరు. ఎవరైనా అలా చేస్తే వారు పీకే 'పవన్‌కళ్యాణ్'కి శత్రువులవుతారు. నన్ను నమ్ము' అంటూ ట్వీట్ చేయడం.. జనసేన ఉపాధ్యక్షుడి పేరుతో ప్రెస్‌నోట్ రావడంతో జనసేన కార్యాలయం నుంచి ఏదో హామీ లభించడంతోనే కత్తి దీనికి పుల్‌స్టాప్ పెట్టాడని భావిస్తున్నారు. ప్రెస్‌నోట్‌ని తనపై దాడి చేయక ముందే ఎందుకు విడుదల చేయలేదు? పవన్ నాకు క్షమాపణ చెప్పేదాకా దీనిని వదిలిపెట్టను. తమపై ఎవరో కుట్ర చేస్తున్నారని ఇష్యూని తప్పుదారి పట్టిస్తున్నారు. జనసేన స్థాపించి నాలుగేళ్లు అయినా ఇంకా పసిగుడ్డు అంటున్నారు. విధివిధానాలు, సిద్దాంతలు, స్పోక్స్‌మెన్‌గా లేని స్థితి జనసేనది అని కత్తి మండిపడి చివరకు మౌనం వహించాడు.
ఇక మరోవైపు ఉస్మానియా యూనివర్శిటీలో కత్తికి అండగా దళిత విద్యార్దులు కూడా ఆందోళన చేయడం, మరోవైపు కత్తిమహేష్ ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం చూస్తే అసలు ఎస్సీ, ఎస్టీ కేసులు ఎలాదుర్వినియోగం అవుతున్నాయి? పెద్ద పెద్ద వారే ఈ చట్టాలను తమ సొంత చుట్టాల్లా ప్రతి విషయానికి ఎస్సీ, ఎస్టీ రంగు పులుముతూ ఎలా దుర్వినియోగం చేస్తూ తమ కుల దళిత సంఘాలను రెచ్చగొడుతున్నారనే విషయం అర్ధమవుతోంది. కత్తి మహేష్ వంటి క్రిటిక్ కూడా ఎస్సీ, ఎస్టీ కేసును పెట్టి పక్కదారి పట్టంచాడంటే ఆయనకున్న కుల పిచ్చి ముందు పవన్ అభిమానులది తక్కువే అని చెప్పాలి.