పవన్ ప్రజల సాదక బాధకాలు తెలుసుకునేందుకు ఇంగ్లాండ్ వెళ్లినప్పుడు పలువురు విద్యార్దులు, విదేశీ ప్రతినిధులతో ముచ్చటించాడు. లండన్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ వ్యక్తిని ఆయన చాలా పొగిడాడు. ఈ సందర్భంగా పవన్‌ని కొందరు పోలెండ్ వ్యక్తులు కూడా కలిశారు. వారి ద్వారా పవన్ గురించి తెలుసుకున్ప పోలెండ్ దేశ అంబాసిడర్ ఆడమ్ బురాకో వస్కీ పవన్‌తో పలు విషయాలపై చర్చించేందుకు ఆసక్తిని కనబరిచాడు.
ఈ రోజు పవన్‌ని ఆయన హైదరాబాద్‌లోని కార్యాలయంలో కలిసి చర్చ జరిపారు. ఈ సమావేశానికి పవన్, పోలెండ్ రాయబారి ఆడమ్ బురాకో వస్కీతో పాటు కొంత మంది విద్యార్దులు కూడా హాజరయ్యారు. ఇది పోలెండ్ రాయబారి పవన్‌కి ఇచ్చిన గౌరవంగా చెప్పుకోవచ్చు.
ఈ సందర్భంగా ఆడమ్ బురాకో వస్కీ భారతదేశంలో గుర్తించిన సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం కోసం పోలెండ్ దేశంలో అమలు అవుతోన్న మంచి పథకాల గురించి తెలుసుకుని అందులో ఆచరణ యోగ్యమైన వాటిని పవన్ స్వయంగా అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం. మొత్తానికి పవన్ మనదేశ మేధావుల కంటే పరదేశ వ్యక్తులకే బాగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.