Advertisementt

విక్రమ్ సినిమా గురించి కమల్ చెప్పాడు..!

Mon 22nd Jan 2018 02:29 PM
kamal haasan,produce,vikram,akshara haasan,movie  విక్రమ్ సినిమా గురించి కమల్ చెప్పాడు..!
Kamal Haasan Tweeted Vikram Movie Details విక్రమ్ సినిమా గురించి కమల్ చెప్పాడు..!
Advertisement
Ads by CJ

కమల్‌హాసన్‌ తర్వాత తమిళంలోనే కాదు దేశవ్యాప్తంగా చియాన్‌ విక్రమ్‌కి విలక్షణ నటునిగా ఎంతో పేరుంది. మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌గా అనిపించే ఆయన తన పాత్ర కోసం తగిన లుక్‌ విషయంలో, పాత్రలో పరకాయ ప్రవేశం చేయడంలో దేనికైనా తెగిస్తాడు. దీనికి ఉదాహరణ శంకర్‌ దర్శకత్వంలో ఆయన నటించిన 'ఐ', అంతకు ముందు ఆయన కెరీర్‌ని మలుపు తిప్పిన 'అపరిచితుడు, శివపుత్రుడు, నాన్న, సేతు, సామి' వంటి ఎన్నో చిత్రాలను చెప్పుకోవచ్చు. కానీ శంకర్‌ 'అపరిచితుడు' తర్వాత ఆ స్థాయి హిట్‌ ఈయనకు మరలా రాలేదు. ఇటీవల విడుదలైన 'స్కెచ్‌' చిత్రం కూడా జస్ట్‌ ఓకే అనిపించింది. ఇక ప్రస్తుతం ఆయన గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో 'దృవనక్షత్రం' అనే సినిమాలో నటిస్తున్నాడు.

తాజాగా మరో చిత్రం ప్రారంభించాడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌ నటించకపోయినా ఈ చిత్రాన్ని కమలే నిర్మిస్తున్నాడు. కమల్‌హాసన్‌కి ఎంతో కాలంగా అసోసియేట్‌, 'చీకటిరాజ్యం' దర్శకుడు రాజేష్‌ ఎం. సెల్వ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం కూడా 'చీకటిరాజ్యం' తరహాలో థ్రిల్లర్‌ మూవీగా రూపొందనుంది.

ఇక ఇందులో విక్రమ్‌ సరసన కమల్‌హాసన్‌ చిన్న కుమార్తె అక్షరహాసన్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఇంతకు ముందు అజిత్‌-శివల కాంబినేషన్‌లో వచ్చిన 'వివేగం' చిత్రంలో అక్షరహాసన్‌ ఓ హ్యాకర్‌ పాత్రను పోషించింది. దీని తర్వాత అక్షరహాసన్‌ పూర్తి స్థాయిలో హీరోయిన్‌గా నటించే చిత్రం ఇదే కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్‌ని అఫీషియల్‌గా జనవరి 1వ తేదీన ప్రకటించాలని భావించారు. కానీ డిసెంబర్‌ 31న విక్రమ్‌ తండ్రి మరణంతో ఇది వాయిదాపడింది. ఈ సినిమా న్యూస్‌ని ఎట్టకేలకు కమల్‌ తాజాగా తన ట్విట్టర్‌ ద్వారా అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశాడు.

Kamal Haasan Tweeted Vikram Movie Details:

Kamal Produce Vikram and Akshara Haasan Movie  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ