Advertisementt

బాపుగారి బొమ్మ.. హైదరాబాద్ వచ్చేసింది!

Mon 22nd Jan 2018 09:43 PM
divyavani,srirasthu subhamasthu,bapu heroine,re entry,tollywood  బాపుగారి బొమ్మ.. హైదరాబాద్ వచ్చేసింది!
Divyavani Ready Act Movies బాపుగారి బొమ్మ.. హైదరాబాద్ వచ్చేసింది!
Advertisement
Ads by CJ

దివ్యవాణి....తాను బాపుగారి బొమ్మ.... తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకుందీ ముద్దుగుమ్మ...పెళ్లి పుస్తకం తో తన సినీ పుస్తకం తెరిచి, ఎదురింటి మొగుడు- పక్కింటి పెళ్ళాం, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు ఇలా సుమారు యాభై  సినిమాలతో తన సినీ పుస్తకం నింపేసుకుందీ బాపు బొమ్మ. తెలుగు వారింట్లో ఎక్కడ పెళ్లి జరిగిన 'శ్రీరస్తు..శుభమస్తు...' పాట మోగాల్సిందే. పెళ్లి వీడియోలలో చూడాల్సిందే.. .ఆ పాట వింటే  దివ్యవాణి గురుతుకు రావాల్సిందే. తన సహజ నటనతో అలరించిన అలనాటి నటి దివ్యవాణి ఇన్నేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ తెలుగు సినిమాలలో మంచి క్యారెక్టర్స్ చేయాలని  ప్రస్తుతం చెన్నై నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహా దర్శకుడు సర్గీయ బాపు గారి ఆశీస్సులతో తెలుగు ప్రేక్షకులకు బాపు బొమ్మగా పరిచయమైన నేను నిజంగా అదృష్టవంతురాలిని. హీరోయిన్ గా పెళ్లి పుస్తకం చిత్రంతో పరిచయం అయినా, ఆ చిత్రానికి ముందుగా నా ఫస్ట్ మూవీ 'సర్దార్ కృష్ణమ నాయుడు'. కృష్ణ గారి కూతురిగా నటించాను. దాని తరువాత 'ముత్యమంతముద్దు' వంటి చిత్రాలలో చిన్న క్యారెక్టర్స్ చేశాను. ఆ తరువాత 'పెళ్లి పుస్తకం' లో ఇరవై మంది అమ్మాయిలలో నేను సెలెక్ట్ అయ్యాను. ఇప్పటివరకు యాభై సినిమాలలో తెలుగు, తమిళ్, మరియు హిందీ చిత్రాలలో నటించాను. చెన్నై లో ఉండగానే నాకు  'ప్రవిత్ర బంధం' సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. ఇంకా తెలుగు సినిమాలలో నటించాలనే ఉద్దేశంతో అందరికి అందుబాటులో ఉండాలని హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాను..అన్నారు.  

Divyavani Ready Act Movies:

Divyavani Ready to Re-entry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ