సినిమా ఇండస్ట్రీలోకి అడుగెట్టిన కొద్ది కాలంలోనే టాప్ పొజిషన్ కి చేరుకున్న రకుల్ ప్రీత్ సింగ్ చిన్న పెద్ద హీరోలతో ఎడా పెడా సినిమాలు చేస్తూ.... హిట్స్ ప్లాప్స్ అనే తేడా లేకుండా క్షణం తీరిక లేకుండా గడిపేసింది. అయితే గత ఏడాది అమ్మడుకి వరుసగా టాలీవుడ్ లో అపజయాలు మాత్రమే కాదు భారీ డిజాస్టర్స్ వెంటాడాయి. ఏదో తమిళంలో ఖాకి వంటి సినిమా హిట్ అయినా ఆ సినిమా తెలుగులో అనుకున్నంతగా ఆడలేదు. ప్రస్తుతానికి రకుల్ చేతిలో చెప్పుకోదగ్గ సినిమా లేదు. అలాంటి టైంలోనే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ లో రకుల్ నటించిన ఒక సినిమా విడుదలకు సిద్దమవుతుండగా.... తాజాగా మరో సినిమాకి కమిట్ అయ్యింది.
అయితే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో ఎటువంటి సినిమాని ఒప్పుకోకుండా సైలెంట్ గా ఉంటూ ఫిట్నెస్ మీద కాన్సంట్రేట్ చేసినట్లుగా కనబడుతుంది. మామూలుగానే రకుల్ ప్రీత్ ఎప్పుడు చూసినా జిమ్ లోనే కనబడుతుంది. ఆఖరికి ఎయిర్ పోర్ట్ లో కూడా కాస్త టైం దొరికితే జిమ్ చేసే రకం రకుల్. మరి ప్రస్తుతానికి తెలుగులో సినిమాలు సైన్ చెయ్యని రకుల్ పూర్తిగా జిమ్ లోనే గడిపేస్తుందేమో అందుకే మరి చిక్కిపోయి కనబడుతుంది. చిక్కిపోయి అనడం కన్నా జీరో సైజు ట్రై చేసింది అంటేనే బెటర్. అంతలా కనబడింది రకుల్. గత శనివారం బాలీవుడ్ లో అంగరంగ వైభవంగా జరిగిన జియో 62 వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కి అటెండ్ అయిన రకుల్ ఇలా జీరో సైజుతో దర్శనమిచ్చింది.
ఎప్పుడు సన్నగా నాజూగ్గా అందంగా కనబడే రకుల్ ప్రీత్ సింగ్ ఇలా ఇప్పుడు మరి చిక్కి శల్యమై కాస్త ఎబ్బెట్టుగా కనబడుతుందనే టాక్ మాత్రం స్ప్రెడ్ అయ్యింది. మరి ఇంకా సన్నబడితే అవకాశాలు దండుకోవచ్చని రకుల్ అలా చేసిందా? లేకుంటే ఖాళీగా కూర్చుని బోర్ కొట్టి ఇలా చేసిందా? అనేది మాత్రం రకుల్ చెబితేనే తెలుస్తుంది.