Advertisementt

ప్రభాస్‌ జాగ్రత్త పడుతున్నాడు..!

Tue 23rd Jan 2018 06:55 PM
prabhas,uv creations,bhaagamathie,anushka,pre release event  ప్రభాస్‌ జాగ్రత్త పడుతున్నాడు..!
Prabhas Takes Care on Rumours ప్రభాస్‌ జాగ్రత్త పడుతున్నాడు..!
Advertisement
Ads by CJ

'బిల్లా, మిర్చి, బాహుబలి' చిత్రాలతో ప్రభాస్‌, అనుష్కలది హిట్‌ పెయిర్‌గా మారింది. అయితే వీరి మద్య స్నేహం కంటే ఏదో బలమైన బంధం ఉందనే వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. వీరిద్దరు వివాహం చేసుకోనున్నారని నేషనల్‌ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఇక వీటిని అనుష్క ఖండించి ఇంకెప్పుడైనా ఇలాంటి వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పింది. మరోవైపు ప్రభాస్‌ సైతం తాము మంచి స్నేహితులమే తప్ప.. తమ మద్య ఏమీ లేదని చెప్పినా ఈ వార్తలకు అడ్డుకట్ట పడలేదు.

కాగా యూవీ క్రియేషన్స్‌ అంటే ప్రభాస్‌ సొంత సంస్థే. ఇందులో ప్రభాస్‌ కూడా ఓ నిర్మాత అని టాక్. అందుకే ప్రభాస్‌ 'బాహుబలి'తో తనకి వచ్చిన క్రేజ్‌ని యూవీ క్రియేషన్స్‌కే 'సాహో' తర్వాత 'జిల్‌' రాధాకృష్ణల చిత్రాలను చేసి లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు 'బాహుబలి' తర్వాత ఏ చిత్రాన్ని ఒప్పుకోని అనుష్కను యువి క్రియేషన్స్‌ బేనర్‌లో 'పిల్లజమీందార్‌' ఫేమ్‌ అశోక్‌తో తెరకెక్కే 'భాగమతి' ప్రాజెక్ట్‌లోకి ఎంటర్‌ చేయడంలో ప్రభాస్‌ కీలక పాత్ర పోషించాడట. ఇక ఈచిత్రం ట్రైలర్‌, టీజర్‌, ఫస్ట్‌లుక్‌ అన్నింటి మీద ప్రభాస్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎంతో కష్టపడే తత్వం, అంకిత భావం ఉన్న హీరోయిన్‌ అనుష్క అని పొగిడాడు. 

ఇక ఇది యూవీ క్రియేషన్స్‌ చిత్రం కావడంతో ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి ప్రభాస్‌ ముఖ్య అతిధిగా వస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఈ వేడుకకు ప్రభాస్‌ హాజరుకాలేదు. ఇక ప్రభాస్‌-అనుష్కలతో ఓ వీడియో ఇంటర్వ్యూని ప్లాన్‌ చేసి ప్రమోషన్స్‌ చేయాలని ఈ చిత్రం యూనిట్‌ భావించింది. దానికి కూడా ప్రభాస్‌ నో చెప్పాడట. ఈ చిత్రం ప్రమోషన్స్‌కి ఆయన దూరంగా ఉండనున్నాడని తెలుస్తోంది. మరి ప్రభాస్‌.. అనుష్కతో మరలా తనపై పుకార్లు వస్తాయని భావించి నో చెప్పాడా? లేక ఆయన 'సాహో'లో బిజీ కారణంగా వీటికి నో చెప్పాడా? అనేది మాత్రం తెలియడం లేదు.

Prabhas Takes Care on Rumours:

No Support from Darling Prabhas to UV Creations Bhaagamathie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ