Advertisementt

పవన్ కి జానీ మాస్టర్ చెప్పిన కథ నచ్చిందట!

Wed 24th Jan 2018 10:50 PM
jani master,pawan kalyan,producer,politics,janasena  పవన్ కి జానీ మాస్టర్ చెప్పిన కథ నచ్చిందట!
Pawan Kalyan Likes Jani Master Story.. But.? పవన్ కి జానీ మాస్టర్ చెప్పిన కథ నచ్చిందట!
Advertisement
Ads by CJ

తెలంగాణ లో అసలైన పాలిటిక్స్ ను ప్రారంభించాడు పవన్ కళ్యాణ్. అక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో ఎవరు ఊహించని విధంగా పవన్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం నేను సినిమాలకు దూరంగా ఉంటానని..సినిమాలు చేసే ఆలోచన లేదని చెప్పిన మాటలు అందరిని షాక్ కు గురిచేసింది. అయితే పవన్ చేస్తానని చెప్పిన సినిమాలు పెండింగ్ లోనే వున్నాయి. మరి ఆ సబ్జక్ట్స్ పవన్ ఎప్పుడు చేస్తారని తెలియాల్సివుంది.

చాల మంది నిర్మాతలు దర్శకులు పవన్ తో సినిమా చేయాలనుకుంటారు. ముఖ్యంగా పెద్ద దర్శకులు. కానీ పవన్ మాత్రం చిన్న దర్శకులకి ఛాన్స్ ఇచ్చి వాళ్లతోనే సినిమాలు చేస్తున్నాడు. అయితే అసలు విషయానికి వస్తే..గతంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు పవన్ కి ఒక కథను వినిపించాడు.  ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చెయ్ ఆ తర్వాత ఆలోచిద్దాం అని చెప్పాడంట.

ఇక ఇండస్ట్రీ వాళ్లతో మంచి పరిచయాలు పెంచుకుని కొరియేగ్రాఫర్ గా సక్సెస్ అయ్యాడు జానీ. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్స్ లో ఒకడు. మల్లి అదే కథను మరో స్టైల్ లో పవన్ కళ్యాణ్ కి వివరించాడట జానీ. దీంతో పవన్ ఆ కథ నచ్చటంతో ఒకే చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను పవన్ ప్రొడ్యూస్ చేస్తాడా.. లేదా తానే యాక్ట్ చేస్తాడా..  అనేది తెలియాల్సివుంది. అయితే ప్రస్తుత వున్న పరిస్థితిల్లో పవన్ నటించే అవకాశం లేదు. సో కచ్చితంగా జానీ మాస్టర్ చెప్పిన కథ ప్రొడ్యూస్ చేసే అవకాశం వుంది.

Pawan Kalyan Likes Jani Master Story.. But.?:

Jani Master Waiting for Pawan Kalyan