Advertisementt

భారీ చిత్రాల ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు..!

Wed 24th Jan 2018 11:57 PM
ram charan,rangasthalam,mahesh,bharath ane nenu,allu arjun,naa peru surya,ravi teja,touch chesi choodu,promotions  భారీ చిత్రాల ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు..!
Tollywood Heavy Budget Movies Promotion Starts భారీ చిత్రాల ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ కి ఈ ఏడాది అంతగా కలిసిరాలేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంక్రాంతికి విడుదల అయిన సినిమాలు ఏవి గట్టిగా నిలబలేకపోయాయి. సో నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమాల మీద అందరి కళ్ళు వున్నాయి. అందుకు తగ్గ ప్రొమోషన్స్ కూడా మూవీ మేకర్స్ మెల్లగా స్టార్ట్ చేశారు.

మొదట రామ్ చరణ్ నటించిన సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం రంగస్థలం. ఈ సినిమా హంగామా బుధవారం సాయంత్రం 4.15గం.లకు టీజర్ ద్వారా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు వున్నాయి. ఈ మూవీ టాకీ పార్ట్ పూర్తి చేసుకుని పాటల చిత్రీకరణలో వుంది. మార్చ్ 30న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఇక అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా నుంచి ఓ దేశభక్తి పాటను.. 25వ తేదీన సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 27న విడుదల కానుంది.  అలానే రవితేజ సినిమా టచ్ చేసి చూడు ట్రైలర్ 25వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చేసుకుంది. ఫిబ్రవరిలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను చిత్రానికి సంబంధించి.. ఓ కీలకమైన ప్రకటనను రిపబ్లిక్ డే రోజున ఇవ్వనున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల అయ్యే అవకాశం వుంది.

Tollywood Heavy Budget Movies Promotion Starts:

Mahesh, Ram Charan, Allu arjun, Raviteja Movie Ready to Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ