ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫాన్స్ డిప్రెషన్ లో వున్నారు. పాలిటిక్స్ కు దగ్గర అవుతూ.. సినిమాలకు దూరం అవుతున్నారు పవన్. లేటెస్ట్ గా పవన్ చెప్పిన స్టేట్మెంట్ ఇందుకు కారణం అయింది. సినిమాల మీద ఆసక్తి లేదని రాజకీయాలే ప్రస్తుతం తన లక్ష్యమని తెగేసి చెప్పేశాడు పవన్ కళ్యాణ్.
కానీ పవన్ ఫ్యాన్స్ కు ఊరట కలిగించే విషయం ఏంటంటే.. తను శాశ్వతంగా సినిమాలకు దూరం అవ్వలేదంట. అప్పుడపుడు గెస్ట్ పాత్రలలో మెరిసే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్. అయితే తను ముందే ఒప్పుకున్న సినిమాలు చేస్తాడో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. ఏఎమ్ రత్నం నిర్మాతగా ఓ సినిమాను, దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ సినిమాలను పవన్ చేయాల్సి ఉంది. అలానే జానీ మాస్టర్ చెప్పిన కథ పవన్ కి తెగ నచ్చేసిందంట. మరి ఇందులో పవన్ నటిస్తాడా లేదా..ప్రొడ్యూస్ చేస్తాడా..అని తెలియాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిల్లో పవన్ నటించే ప్రసక్తే లేదని చెబుతున్నారు.
అటు పాలిటిక్స్ లో ఉంటూ.. ఇటు సినిమాలని తన బ్యానర్ పీకే క్రియేటివ్ వర్క్స్ పేరుతో సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచన కూడా ఉందంట జనసేన అధినేతకు. ఆల్రెడీ నితిన్ తో ఇదే బ్యానర్ పై లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఒక సినిమాను చేస్తున్నాడు.