తెలుగు, తమిళ, మలయాళంలో తనకి నచ్చిన సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకునే స్టార్ హీరోయిన్ నయనతార. ఒకపక్క స్టార్ హీరోలు, చిన్న హీరోలతో సినిమాలు చేస్తూనే లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ అదరగొట్టేస్తుంది. అలాంటి నయనతార ఎప్పుడూ.. సినిమా ప్రమోషన్స్ లో కానీ, సినిమా ఇంటర్వూస్ కి కానీ అస్సలు అటెండ్ కాదు. ఏమన్నా అంటే నాకు సెంటిమెంట్ అంటూ నిర్మాతల నోరు మూయించేస్తుంది. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో దున్నేస్తున్న నయనతార.. మీడియాతో చాలా తక్కువగా మాట్లాడుతుందని టాక్ మొదటి నుండి ఉంది. అయితే ఈమధ్యన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే నయనతార టాలీవుడ్ స్టార్ హీరోలను అవమానించిందా అనిపిస్తుంది.
కోలీవుడ్ లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నయనతారకి మీకు ఏ స్టార్ హీరోస్ అంటే ఇష్టమనే ప్రశ్న ఎదురైంది. అయితే ఆ ప్రశ్నకి బదులుగా తనకి కోలీవుడ్ హీరోస్ విజయ్ అన్నా... అలాగే అజిత్ అన్నా చాలా ఇష్టమని చెప్పి టాలీవుడ్ హీరోస్ ని హార్ట్ చేసింది. మరి అందాలతార నయనతార చెప్పిన ఈ అందమైన సమాధానానికి కోలీవుడ్ ప్రేక్షకులకు నచ్చినా ఇక్కడ టాలీవుడ్ హీరోస్ అభిమానులు మాత్రం హార్ట్ అయినట్లే కనబడుతుంది. ఎందుకంటే నయనతారకి స్టార్ డం వచ్చింది మాత్రం ఎక్కువగా తెలుగులోనే. బాలకృష్ణ సరసన నటించిన శ్రీరామరాజ్యంలో సీత పాత్రలో నయనతార అదరగొట్టి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది.
మరి అలాంటి నయనతార ఇలా కేవలం కోలీవుడ్ హీరోలమీదే అభిమానం చూపిస్తూ తెలుగు స్టార్ హీరోలను చులకన చేసిందనే భావన మాత్రం ఈ ఇంటర్వ్యూ లో నయన మాటలబట్టి అర్ధమవుతుందని తెలుగు హీరోల అభిమానులు వాపోతున్నారు.