Advertisementt

స్వేచ్ఛ గురించి అనసూయ క్లాస్..!

Sun 28th Jan 2018 03:30 PM
anasuya,controversial,message,republic day  స్వేచ్ఛ గురించి అనసూయ క్లాస్..!
Anchor Anasuya Tweets Her Heart Out స్వేచ్ఛ గురించి అనసూయ క్లాస్..!
Advertisement
Ads by CJ

అదేమంటే ప్రతి ఒక్కరు స్వేచ్చ గురించి మాట్లాడుతున్నారు. స్వేచ్చ, ప్రాధమిక హక్కులతో పాటు భారతరాజ్యాంగం మనకి ఎన్నో బాధ్యతలను కూడా విధించింది. ఇక నేడు భారతదేశంలో స్వేచ్చ మరింతగా ఎక్కువైందేమో అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇది రాంగోపాల్‌వర్మ వంటి వారి వల్ల వస్తున్న సమస్య. ఆయన తాజాగా 'గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌' తీసి రిపబ్లిక్‌డే రోజున ఏకంగా 'సత్యమేవ జయతే'ని 'సత్యమియా జయతే'గా మార్చడం ఈ స్చేచ్చకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఇక మాంసం తిన్నామని చెప్పి ఎవరూ ఎముకలు మెడలో వేసుకుని తిరగరు. పోర్న్‌స్టార్‌ సన్నిలియోన్‌ తనని పోర్న్‌స్టార్‌గా చూడటం తప్పు అంటే అది ప్రజల తప్పు కాదు.. ఆమెకి ఉన్న ఇమేజ్‌ దానికి కారణం. 

ఇక సినిమాలలో నటన కూడా ఓ వృత్తి కాబట్టి, బుల్లితెర, వెండితెరపై ఎలాంటి డ్రస్సులో కనిపించాలనేది ఆయా నటీనటులు, దర్శకనిర్మాతల ఇష్టానుసారం జరుగుతుంది. అదే సమయంలో సమాజం అన్నాక కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. లేకపోతే మనుషులకు కుక్కలకి తేడా లేదు. సమాజంలో బతికేటప్పుడు దానికి మనం కొంతైనా గౌరవం ఇవ్వాలి. విద్యాబాలన్‌ వంటి నటి ఇందిరాగాంధీగా, శక్తికపూర్‌ వంటి నటుడు మోడీగా, షకీలా వంటి నటి సీతాదేవిగా నటిస్తామంటే అది నటనే కదా.. అని ఎవ్వరూ భావించరు. ఆయా పాత్రలుపోషించే వారి ఇమేజ్‌ కూడా ఆయా పాత్రలపై ఉంటుంది. ఇక సెలబ్రిటీలుగా మారిన తర్వాత మరింత జాగ్రత్త అవసరం. కానీ అనసూయ మాత్రం తనకు నచ్చిన దుస్తుల్లో తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తానని, కానీ ప్రేక్షకులు తనను అసభ్యంగా కామెంట్స్‌ చేస్తున్నారని, ఓ కూతురిగా, తల్లిగా, కోడలిగా, నటిగా, భార్యగా నా బాధ్యతలను సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నా కూడా ఇలాంటి అసభ్యకరమైన కామెంట్స్‌ చేస్తున్నారు. 

రిపబ్లిక్‌డే సందర్భంగా అడుగుతున్నాను.. నాకు ఇష్టమొచ్చినట్లు ఉండేహక్కు, ఇష్టమొచ్చిన దుస్తులు ధరించే స్వేచ్చ లేదా అని అంటోంది. అలా అయితే ఆమె సోషల్‌మీడియాలో ఇలా ప్రవర్తించే వారిని బ్లాక్‌ చేసుకోవాలి. నా ఇష్టం అని బట్టలు లేకుండా వీధిలో తిరిగితే అది స్వేచ్చ కిందకు రాదు. విచ్చలవిడి తనంగా, న్యూసెన్స్ కేసుగా మారుతుంది. మతి స్థిమితం లేని వారు బట్టలు లేకుండా వీధుల్లో తిరుగుతుంటేనే ఎవరో ఒకరు వచ్చి బట్టలు కట్టే సంస్కృతి మనది. అంతేగానీ విదేశాలలో లాగా క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగేటప్పుడు అందరి దృష్టిలో పడాలని నగ్నంగా స్టేడియంలో చొరబడే వారిని విదేశాలలో కూడా ఉపేక్షించరు. నోరు మంచిదైతే ఊరు మంచిందవుతుందన్న సామెత అనసూయకి బాగా వర్తిస్తుందనే చెప్పాలి. 

Anchor Anasuya Tweets Her Heart Out:

Anasuya's Controversial message on Republic Day     

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ