మంచు మనోజ్ సరనన నటించిన 'శ్రీ' చిత్రంతో పరిశ్రమకు పరిచయమై, 'హ్యాడీడేస్'తో గుర్తింపు తెచ్చుకుని స్టార్స్ అందరితో నటించిన మిల్కీబ్యూటీ తమన్నా. ఆమె ఇండస్ట్రీకి వచ్చి పుష్కరకాలం దాటింది. ఇన్నేళ్లు ఆమె తన హవా చాటుకోవడం నిజంగా గొప్ప విషయమే. రోజుకో కొత్త అమ్మాయి దిగుమతి అవుతున్న రోజుల్లో శ్రీ నుంని 'బాహుబలి' చిత్రంలోని అవంతిక వరకు ఆమె తనను తాను తీర్చిదిద్దుకుంటూ, తన అందాలను కాపాడుకుంటూనే వస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె కళ్యాణ్‌రామ్ సరసన ఓ చిత్రంలో నటిస్తూ బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన కంగనారౌనత్ చిత్రం 'క్వీన్' తెలుగు రీమేక్‌లో నటిస్తోంది.
ఇక ఎవరైనా కెరీర్ మొదట్లో తప్పులు చేస్తూ ఊరుకుంటారని, కొత్త కదా... పోయే కొద్ది తెలుసుకుంటుందని భావిస్తారని, కానీ ఇప్పటికే 12 ఏళ్ల కెరీర్ సాగించిన సమయంలో ఇకపై తప్పులు చేయకూడదని, ఇంత అనుభవం సాధించిన తర్వాత తప్పులు చేస్తే మాత్రం ఎవ్వరూ అంగీకరించరని తెలుపుకొచ్చింది. తనకున్న అనుభవంతో మంచి కధా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుని ముందుకు సాగి, తమన్నా చిత్రం అంటే మంచి చిత్రం అని అందరూ భావించే పాత్రలే చేస్తానని చెబుతోంది.
ఇక కొందరు నటీమణులు ఇప్పుడు గ్లామర్‌షో చేసే డ్రస్‌లో నటించాలని బావిస్తున్నారని, అయినా వేసేవి ఏ దుస్తులైనా అవి మన శరీరాకృతికి సరిగ్గా నప్పుతున్నాయా? సౌకర్యవంతంగా ఉంటున్నాయా? అన్నదే ముఖ్యమని, మనకి కంఫర్టబుల్‌గా ఉండే దుస్తులు ధరిస్తేనే మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆమె స్పష్టం చేసింది.