సినిమా హీరోలంటే వీరాభిమానులు ఉంటారు. వారు సినిమా సినిమాకి, అభిమానంను అభిమానంగా తీసుకోకుండా విపరీతమైన అభిమానం చూపుతూ ఉంటారు. ఇలాంటి సంఘటనే తాజాగా కన్నడ నటుడు కిచ్చాగా పేరు తెచ్చుకున్న సుదీప్ విషయంలో జరిగింది. సుదీప్ వీరాభిమాని ఒకరు తన చేతిపై కిచ్చా అనే పచ్చబొట్టుని పొడిపించుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై సుదీప్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, ఆ అభిమాని చేసిన దానికి బాధపడాలో, సారీ చెప్పాలో, సంతోషించాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. ఆ అభిమాని పచ్చబొట్టు పొడిపించుకునే సమయంలో ఎంత బాధపడి ఉంటాడో ఊహించుకుంటేనే బాధగా ఉంది.
మీరు కేవలం నా సినిమాలను డబ్బులు పెట్టి చూసి నాపై అభిమానం చూపితే చాలు. అంతకంటే మీరు నాకేమీ చేయాల్సిన పనిలేదు. అంతులేని మీ అభిమానానికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఇలాంటి పనులు దయచేసి చేయవద్దని తన అభిమానులను సుదీప్ కోరాడు. ఇక ఈయన నటించిన పలు చిత్రాలు మలయాళంలోకి కూడా డబ్ అయి సుదీప్‌కి మంచి పేరును తీసుకు వచ్చాయి. ప్రస్తుతం ఆయన ప్రేమ్ దర్శకత్వంలో శివరాజ్‌కుమర్, అమీజాక్సన్‌లతో కలిసి 'దివిలన్' చిత్రంలో నటిస్తున్నాడు.
ఇక మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న మలయాళం చిత్రం 'నీరళి'లో కూడా కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఆయన చేస్తున్న తొలి స్ట్రయిట్‌మలయాళ చిత్రం ఇదే కావడం విశేషం. ఇక ఈయన చిరంజీవితో కలిసి నటిస్తున్న'సై..రా..నరసింహారెడ్డి' షూటింగ్‌లో వచ్చే షెడ్యూల్ నుంచి పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.