Advertisementt

ఈ హీరోయిన్ రవితేజనే నమ్ముకుంది!

Tue 30th Jan 2018 02:59 PM
seerat kapoor,confident,ravi teja,touch chesi chudu  ఈ హీరోయిన్ రవితేజనే నమ్ముకుంది!
Seerat Kapoor Hopes on Touch Chesi Chudu ఈ హీరోయిన్ రవితేజనే నమ్ముకుంది!
Advertisement
Ads by CJ

'రన్ రాజా రన్' సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది సీరత్ కపూర్. ఈ సినిమా తర్వాత చేసింది తక్కువ సినిమాలే అయినా అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో సినిమా ఛాన్సులు కూడా తగ్గిపోయాయి.‘రాజు గారి గది- 2’.. ‘ఒక్క క్షణం’ లాంటి సినిమాల్లో సీరత్ క్యారెక్టర్లు.. ఆమె లుక్స్ ఏమాత్రం జనాల్ని ఆకట్టుకోలేకపోయాయి.

ఇప్పుడు ఆమె దృష్టంతా రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’ మీదే ఉంది. ఈ సినిమాతో మళ్ళీ బ్యాక్ టూ ఫామ్ రావాలని సీరత్ భావిస్తున్నట్లుగా ఉంది. నిన్న రిలీజ్ అయిన ‘రాయే రాయే..’ వీడియో సాంగ్ లో సీరత్ ఆలౌట్ గ్లామర్ అటాక్ మొదలు పెట్టేసినట్లుగా అనిపిస్తోంది.

గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత గ్లామర్ గా.. సెక్సీగా కనిపిస్తోంది ఈ పాటలో.  వరస ఫెయిల్యూర్లతో కెరీర్ ప్రమాదంలో పడ్డ నేపథ్యంలో ‘టచ్ చేసి చూడు’ లాంటి మాస్ సినిమాలో సీరత్ క్లిక్ అయితే మళ్లీ కెరీర్ ఊపందుకుంటుందని సీరత్ భావిస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా రాశిఖన్నా నటిస్తుంది. అయితే రాశి క్యారెక్టర్ చాలా పద్ధతిగా ఉంటుందని సమాచారం. సో ఈ సినిమాలో గ్లామర్ అటాక్ మొత్తం సీరతే చూపించ బోతుందంట. మరి ఈ సినిమా సీరత్ లైఫ్ ని ఎలా టర్న్ చేస్తుందో చూడాలి.

Seerat Kapoor Hopes on Touch Chesi Chudu:

Seerat Kapoor Confident on Ravi Teja Touch Chesi Chudu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ