'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత వెంటనే ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేయాలి త్రివిక్రమ్. కానీ 'అజ్ఞాతవాసి' అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు. కానీ త్రివిక్రమ్.. ఎన్టీఆర్ కోసం రెడీ చేసిన స్క్రిప్ట్ మరింత మెరుగ్గా తయారు చేయడంపై దృష్టి పెట్టాడు.
కాస్టింగ్ విషయంలో కూడా త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెల్సింది. మొదట ఎన్టీఆర్ సినిమా కోసం హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ ని అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధకపూర్ ను తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నారనేది టాలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట. ఇందుకు ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం శ్రద్ధకపూర్, ప్రభాస్ పక్కన సాహోలో నటిస్తోంది. ప్రభాస్ పక్కన నటిస్తుంది కాబట్టి ఇప్పటికే టాలీవుడ్ లో శ్రద్ధకు కావాల్సినంత పాపులారిటీ వచ్చింది. సో ఎన్టీఆర్ సినిమాకు తీసుకుంటే అది ప్లస్సవుతుందని త్రివిక్రమ్ టీంలోని మిగతా సభ్యులు కూడా అనుకుంటున్నారట. ఇదేగాని వర్కవుట్ అయితే శ్రద్ధ టాలీవుడ్ లో డబుల్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే.