టాలీవుడ్ లో హీరో కమ్ కేరెక్టర్ ఆర్టిస్ట్ అయిన సామ్రాట్‌రెడ్డిని పోలీసులు ఈ మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. సామ్రాట్ పై అనేక సెక్షన్స్ కింద పోలీసులు కేసును నమోదు చేసి అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఇంతకీ సామ్రాట్ అరెస్ట్ కావడానికి గల కారణాలు విన్న టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నటుడు సామ్రాట్ తన భార్య వస్తువులను దొంగతనం చేశాడనే కేసులో అరెస్ట్ అయ్యాడు. స్వయానా సామ్రాట్ భార్య హర్షిత ఈ కేసు పెట్టింది కూడా.
గత కొంతకాలంగా విభేదాల కారణంగా దూరం దూరంగా ఉంటున్న సామ్రాట్ హర్షితలు పెళ్లి అయినప్పటి నుండే గొడవలు పడుతున్నారు. సామ్రాట్ పెళ్ళికి టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. పెళ్లి జరిగిన కొంత కాలానికే సామ్రాట్ తనని అధిక కట్నం కోసం వేధిస్తున్నాడంటూ హర్షిత పోలీలకు ఫిర్యాదు చేసింది. అప్పటినుండి భార్య భర్తలిద్దరూ విడిగానే వుంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా నటుడు సామ్రాట్ తన భార్య లేని సమయంలో ఆమె ఉంటున్న నివాసానికి వెళ్లి తనకు చెందిన వస్తువులను అంటే ఫ్రిజ్ ఇలాంటివన్నీ తీసుకెళ్లిపోయాడట. అయితే తన వస్తువులను తన ప్రమేయం లేకుండా తీసుకెళ్లిన భర్త సామ్రాట్ పై హర్షిత దొంగతనం కేసు మోపింది.
హర్షిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరి గతంలో కూడా సామ్రాట్‌పై రాజేంద్రనగర్ పీఎస్‌లో వరకట్నం వేధింపుల కేసు ఉంది.