సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన 'పద్మావత్' చిత్రం జనవరి 25 న విడుదలై కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. 'పద్మావత్'షూటింగ్ మొదలైనప్పటి నుండి అనేక అడ్డంకులు, సమస్యలతో విసిగి వేసారింది. 'పద్మావత్' సినిమా విడుదల సమయానికి ఆ అడ్డంకులు అధికమయ్యి.. ఎట్టకేలకు జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా సూపర్ టాక్ తో అదరగొడుతున్నప్పటికీ ఈ సినిమాపై వచ్చిన వివాదాలు, సమస్యలు ఇంకా ముగిసిపోలేదు. ఒకానొక సమయంలో 'పద్మావత్' లో మెయిన్ లీడ్ లో నటించిన దీపికాని చంపేస్తామంటూ ఆమె తలకు వెల కూడా కట్టారు.
కొన్ని రోజులపాటు అజ్ఞాతంలో ఉన్న దీపికా ఇప్పుడు 'పద్మావత్' సినిమా విజయాన్ని బాగానే ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ మధ్యన దీపికా ఒక ఈవెంట్‌కు హాజరుకాగా అక్కడ దీపికా పదుకొనె సన్నిహితులు దీపికను ఉద్దేశించి మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి చారిత్రాత్మక సినిమాలు చేస్తావా? అని అడిగినపుడు... దానికి దీపికా నవ్వుతూ అమ్మో ఇంత జరిగిన తరువాత కూడా ఇలాంటి సినిమాలా.... ఎప్పటికీ చేయలేను అని చెప్పిందట. మరి 'పద్మావత్' తో వచ్చిన వివాదాలకు విసిగిపోయిన దీపిక ఇలాంటి డెసిషన్ తీసుకోవడంలో తప్పేమి లేదు.
ఇకపోతే ఈ సినిమాలో తనకు ఖిల్జీ, రావల్ మధ్య జరిగిన యుద్ధం సీను బాగా నచ్చిందని....ఇద్దరు పెద్ద స్టార్ల మధ్య ఇటువంటి యాక్షన్ సీక్వెన్స్ తానూ ఎప్పుడూ చూడలేదని దీపికా చెప్పింది. అలాగే తన తల్లిదండ్రులు ఈ నినిమా చూసి తనను అభినందనలతో ముంచెత్తారని.... అసలు దీపిక నిజంగా తమ కూతురేనా.... అని ఆశ్చర్యపోయారని తెలిపింది.