Advertisementt

ప్రభాస్ ఫ్యాన్స్ ని భయపెట్టేస్తున్న సెంటిమెంట్!

Wed 31st Jan 2018 11:53 PM
prabhas,saaho,rajamouli,sentiment,prabhas fans  ప్రభాస్ ఫ్యాన్స్ ని భయపెట్టేస్తున్న సెంటిమెంట్!
Prabhas Fans Feared with Rajamouli Movies Sentiment ప్రభాస్ ఫ్యాన్స్ ని భయపెట్టేస్తున్న సెంటిమెంట్!
Advertisement
Ads by CJ

రాజమౌళి సినిమాలతో హీరోస్ అందరికి మంచి సక్సెస్ వస్తుంది. కానీ రాజమౌళితో సినిమా చేసిన ఎవరూ.. ఆ తర్వాత సక్సెస్ కొట్టలేకపోయారు. అయితే ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ను కాసింత భయపెడుతోంది. ఇది ఇప్పుడు మాట కాదు.. ఎప్పటి నుండో ఈ సెంటిమెంట్ ప్రతీ హీరో ఫ్యాన్స్ ను భయపెడుతుందే. 'సింహాద్రి' తర్వాత హిట్ కొట్టేందుకు ఎన్టీఆర్ చాలానే తిప్పలు పడి.. చివరకు మళ్లీ 'యమదొంగ' అంటూ జక్కన్నే సినిమా తీసేవరకూ వెయిట్ చేయాల్సి వచ్చింది. 

అలానే హీరో నితిన్ కూడా 'సై' సినిమా తర్వాత ఏళ్ల తరబడి సక్సెస్ కోసం నానా తిప్పలు పడ్డాడు. 'మర్యాద రామన్న' తర్వాత సునీల్ పరిస్థితి కూడా అంతే. 'పూలరంగడు' మినహాయిస్తే.. మరే చిత్రంతోనూ ఆకట్టుకోలేకపోయాడు. 'విక్రమార్కుడు' సినిమా తర్వాత రవితేజకు ఖతర్నాక్ అంటూ ఫ్లాప్ ఎదురైంది.

ఇప్పుడు 'బాహుబలి' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ తన తర్వాత చిత్రం యంగ్ డైరెక్టర్ సుజీత్ తో చేస్తున్నాడు. ఈ 'సాహో' చిత్రంపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ను వెంటాడుతుంది. ఈ ప్లాప్ సెంటిమెంట్ బ్రేక్ చేయాలంటే ప్రభాస్ 'సాహో'తో హిట్ కొట్టాల్సిందే. మరి ప్రభాస్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.

Prabhas Fans Feared with Rajamouli Movies Sentiment:

Prabhas fans unhappy with Rajamouli sentiment

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ