ఎన్టీఆర్ ఎప్పటి నుండో త్రివిక్రమ్ దర్శకత్వంలో వర్క్ చేయాలని చూస్తున్నాడు. అయితే ఆ సమయం ఇన్నాళ్ళకి ఎన్టీఆర్ చెంతకి వచ్చింది. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నాడా..? అనే అనుమానం మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలు ఎప్పుడూ హిట్ అనే టాక్ తోనే ఉన్నాయి. కానీ త్రివిక్రమ్ తాజాగా డైరెక్ట్ చేసిన అజ్ఞాతవాసి మాత్రం ఘోరమైన డిజాస్టర్ అయ్యింది. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా అంటుంటే ఎన్టీఆర్ అభిమానులకే కాదు ఎన్టీఆర్ కి కూడా కాస్త కంగారుగా ఉందనే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే ఎన్టీఆర్, త్రివిక్రమ్ ని కలిసి కథలో కొన్ని మార్పులు చెప్పడమే కాక మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని తప్పించమనే కండిషన్ పెట్టినట్లుగా.. అలాగే ఎన్టీఆర్ త్రివిక్రంతో చెయ్యబోయే సినిమా కోసం లైపో చేయించుకుంటున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. అయితే అవన్నీ ఒట్టి పుకార్లే అని ఎన్టీఆర్, త్రివిక్రంతో సినిమా చేసే విషయంలో పిచ్చ క్లారిటీగా ఉన్నాడని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్న మాట. త్రివిక్రంతో సినిమా విషయంలో ఎన్టీఆర్ తన సన్నిహితులు వద్ద అన్ని విషయాల్లోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి.
త్రివిక్రంతో చెయ్యబోయే సినిమా స్క్రిప్ట్ విషయంలో తన ప్రమేయం ఉండదని.. త్రివిక్రమ్ కు తాను ఒక్క మాట కూడా చెప్పలేదని... అలాగే తాను ఈ సినిమా కోసం లైపో సర్జరీ చేయించుకున్నట్లు వస్తున్న వార్తల్లోనూ నిజంలేదని... తాను సన్నబడడానికి ఎక్సర్ సైజ్ లు.. డైట్ కంట్రోల్ మాత్రమే చేస్తానని. అంతేగాని లైపో లు గట్రా చేయించుకోనని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం పూజాకార్యక్రమాలు మాత్రమే జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్ పైకి వెళ్ళబోతున్న విషయం తెలిసిందే.