Advertisementt

పన్నుతో పోయేది.. ఊచల కెళ్ళింది!

Thu 01st Feb 2018 02:39 PM
amala paul,arrest,bail,heroine  పన్నుతో పోయేది.. ఊచల కెళ్ళింది!
Amala Paul arrested but out on bail పన్నుతో పోయేది.. ఊచల కెళ్ళింది!
Advertisement
Ads by CJ

మొదట్లో ఎంతో పద్దతిగా కనిపించిన హీరోయిన్‌ అమలాపాల్‌ ఆ తర్వాత తనలోని అపరిచితురాలిని బయటకు తీసింది. డైరెక్టర్ విజయ్‌తో పెళ్లి, విడాకులు, ధనుష్‌తో ఎఫైర్‌, సుచీలీక్స్‌తో పాటు తాను చేసే సినిమాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. ఇక ఈమె ఇంతకు ముందు కోటి రూపాయల కారును పాండిచ్చేరిలోని తప్పుడు దృవీకరణ పత్రం సమర్పించి, కేరళ ప్రభుత్వానికి రావాల్సిన 20లక్షల రూపాయలు పన్నును ఎగ్గొట్టిన కేసు ఆమె మెడకు బలంగానే చుట్టుకుంటోంది. ఆమె పాండిచ్చేరిలో తనకు ఇల్లు ఉందని వాదిస్తోంది. కానీ అధికారులు మాత్రం అవి భోగస్‌ అని, ఆమె బోగస్‌ పత్రాలు సమర్పించి పన్ను ఎగ్గొట్టిందని ఆధారాలు సేకరిస్తున్నారు. 

ఇక ఈమె ముందుస్తు బెయిల్‌కి కోర్టుకి వెళ్లగా కేరళ హైకోర్టు ముందు క్రైం బ్రాంచ్‌ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఇక క్రైం బ్రాంచ్‌ విచారణలో ఈమె తన తప్పుని ఒప్పుకుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆమెని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయింది. కేవలం తన స్థాయికి 20లక్షల కోసం ఇంతలా దిగజారాలా? అనే విమర్శలు ఆమెపై వస్తున్నాయి. సెలబ్రిటీలు పది మందికి ఆదర్శనంగా నిలవాలని, ఇలాంటి చీటింగ్‌ పనులను సెలబ్రిటీలే చేస్తుంటే ఎలా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. 

మరోపక్క ఈమె ఏమి ఎరుగని దానిలా తన పనిలో తాను పడిపోయింది. తాను నటించే చిత్రాల షూటింగ్స్‌తో పాటు ఫిబ్రవరి 3 వ తేదీన మలేషియాలో డాజింగ్‌ తమిళచ్చి అనే ప్రోగ్రాం జరగనుంది. ఈ వేడుకకు పలువురు కోలీవుడ్‌ స్టార్స్‌ రానున్నారు. ఈ వేడుకలో అమలాపాల్‌ స్టేజీపై డ్యాన్స్‌ కూడా చేయనుందట. ప్రస్తుతం ఆ డ్యాన్స్‌ ప్రాక్టీసులో ఆమె బిజి బిజీగా ఉంది. మరోవైపు కేరళలో సురేష్‌గోపి, ఫహద్‌ఫాజిల్‌పై కూడా ఇలాంటి పన్ను ఎగవేత కేసు నమోదవ్వడం విశేషం.

Amala Paul arrested but out on bail:

Amala Paul has been facing criticism and allegations that she provided a fake address in Pondicherry to default a whopping 20 lakhs Income Tax by registering her luxurious car worth 1 crore last year

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ