Advertisementt

నిహారికతో పెళ్లిపై యంగ్‌ హీరో క్లారిటీ!

Thu 01st Feb 2018 09:28 PM
niharika,marriage,naga shourya,rumors  నిహారికతో పెళ్లిపై యంగ్‌ హీరో క్లారిటీ!
Naga Shaurya Gives Clarity On Marriage With Niharika నిహారికతో పెళ్లిపై యంగ్‌ హీరో క్లారిటీ!
Advertisement
Ads by CJ

గత కొన్నిరోజులుగా యంగ్‌హీరో నాగశౌర్య.. మెగాబ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారికను పెళ్లి చేసుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక నాగశౌర్య తొలిసారిగా నటించి, నిర్మించిన 'ఛలో' చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి మెగాస్టార్‌ ముఖ్యఅతిధిగా రావడంతో ఇవి మరింత జోరందుకున్నాయి. దీనిపై హీరో నాగశౌర్య స్పందిస్తూ, తాను నటించిన చిత్రాల హీరోయిన్లతో తనకు ఎఫైర్లు ముడిపెడుతున్నారని, 'కళ్యాణవైభోగమే' సమయంలో మాళవిక, 'ఊహలు గుస గుసలాడే' సమయంలో రాశిఖన్నా, 'ఒక మనసు'తో నిహారిక, 'జాదూగాడు' సమయంలో సోనారికతో తనకు ఎఫైర్లు ముడిపెట్టి వారిని తాను వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వండి వార్చారని,, ఇప్పుడు నిహారిక విషయంలో మరలా అదే పని చేస్తున్నారని, మొదట్లో వీటిని పట్టించుకోకపోయినా శృతి మించడంతో అవి చిరాకును కలిగిస్తున్నాయని చెప్పుకొచ్చాడు. 

మరో మూడు నాలుగేళ్ల దాకా తన వివాహం ప్రసక్తి తెచ్చేది లేదని, తాను ఆ తర్వాత కూడా తన తల్లి చూసిన అమ్మాయినే అరేంజ్‌డ్‌ మేరేజ్‌ చేసుకుంటాను తప్ప లవ్‌ మ్యారేజ్‌ చేసుకోనని స్పష్టం చేశాడు. ఇక 'ఛలో' చిత్రం కథ ఎంతో బాగా నచ్చడంతో తన తల్లి ఈ చిత్రంతో నిర్మాతగా మారిందని, ఈ చిత్రాన్ని చూశాను.. ఖచ్చితంగా హిట్‌ అవుతుందని చెప్పుకొచ్చాడు. మొదట ఈ కథను దర్శకుడు వెంకీ కుడుముల ఓ నిర్మాత వద్దకు తీసుకుని వెళ్లితే నాగశౌర్య వద్దులే అని దర్శకునితో అన్నాడని, నేను ఇదే కథను అదే నిర్మాత వద్దకు తీసుకెళ్తే వెంకీ బదులుగా మరో దర్శకుడిని పెట్టుకుందామని మాట మార్చాడని, దాంతో మాతో డబుల్‌ గేమ్స్‌ వద్దు సార్‌.. అని చెప్పి తానే ఈ చిత్రాన్ని నిర్మాస్తున్నానని తెలిపాడు. మరి 'ఛలో' చిత్రం నాగశౌర్యకి ఎలాంటి బ్రేక్‌నిస్తుందో వేచిచూడాల్సివుంది...!

Naga Shaurya Gives Clarity On Marriage With Niharika:

Young hero trashes rumors of marriage with Niharika

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ