బాలీవుడ్ లో దీపిక పదుకునె సుడి మాములుగా లేదు. ఏ సినిమా వచ్చిన.. ఏ పాత్ర వచ్చిన వెంటనే ఒకే చేసేస్తుంది. దీపిక రేంజ్ వున్న హీరోయిన్స్ మాత్రం సినిమాలు రాక నానా అవస్థలు పడుతున్నారు. అయితే దీపికా మాత్రం లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ, అలాగే హిస్టారికల్ మూవీస్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
లేటెస్ట్ గా దీపిక ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన స్టిల్స్ లో చాలా కొత్తగా కనిపిస్తుంది. ఫెమినా కవర్ పేజ్ లో దీపిక కనిపించిన విధానం కూడా చాలా స్టైలిష్ గా ఉంది. ముఖ్యంగా క్లివెజ్ షో అందరిని స్టన్ అయ్యేలా చేసింది. బాలీవుడ్ లో ప్రస్తుతం ఆమె ఇచ్చిన స్టిల్ వైరల్ అవుతుంది.
ఇక అలాగే 'పద్మావత్' భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మొదట ఈ సినిమా రిలీజ్ పై ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాలలో ఈ సినిమా ప్రదర్శించకపోయినప్పటికి సినిమాపై ఎటువంటి ప్రభావం పడకుండా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. సినిమాను కొన్న బయర్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.