సూర్యాపేట జిల్లాకు చెందిన రంగుల నరేష్ యాదవ్ దివ్యాంగుడు. అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైనా అక్కడికి వెళ్లేందుకు డబ్బులు లేక పారా అథ్లెట్ నరేష్ అనేక ఇక్కట్లు పడుతున్నాడు. ఈ నెల 31న ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం చదవి వెంటనే హీరో సాయిధరమ్ తేజ్ స్పందించారు. గురువారం నరేశ్ యాదవ్‌కు లక్ష రూపాయిల చెక్కును స్వయంగా అందజేశారు. అనంతరం నరేష్ గురించిన వివరాలు, వాలీబాల్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించాలని కోరుతూ నరేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.