రామ్ గోపాల్ వర్మ పిచ్చి పరాకాష్టకు చేరింది. జీఎస్టీ తో మహిళా సంఘాల నుండి తీవ్ర వ్యతిరేఖతని ఎదుర్కొంటున్న వర్మ ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జీఎస్టీ ని అడల్ట్ కంటెంట్ ఫోర్న్ సినిమాని తెరకెక్కిం చాడంటూ నానా రచ్చ జరుగుతుంది. మరి వర్మపై నిమిష నిమిషానికి ఏదో ఒక వార్త అయితే మీడియాలో వినబడుతుంది. మరి ఇలాంటి సమయంలో నాగార్జున వర్మని ఏం చేస్తాడనే ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే శివతో తన కెరీర్ ని నిలబెట్టాడనే విషయంలో వర్మకి నాగ్ పిలిచి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పటికే వర్మ - నాగార్జున సినిమా పట్టాలెక్కడం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోవడం జరిగిపోయింది.
ఇలాంటి సమయంలో వర్మ ఇలా వివాదాలతో సతమతమవ్వడం చూసిన నాగ్ వర్మని వదిలేస్తాడనే టాక్ మొదలయ్యింది. ఎందుకంటే నాగార్జునకి వివాదాలంటే పెద్దగా ఇష్టముండదు. కానీ వర్మ మాత్రం నిత్యం వివాదాలతోనే కాపురం చేస్తున్నాడు. మరి నాగ్ - వర్మ సినిమా రెండో షెడ్యూల్ మొదలవ్వకముందే ఆగిపోతుందా? అసలు నాగార్జున వర్మని క్షమిస్తాడా. మరి వర్మకి ఇప్పుడు ఒక హిట్ అత్యవసరం. అది నాగ్ తో సాధ్యమవుతుంది అనుకుంటున్న తరుణంలో వర్మ ఇలా న్యూడ్ కంటెంట్ తో సినిమాలు చేసి నాగార్జునకి పిచ్చ కోపం తెప్పిస్తున్నాడు. చూద్దాం నాగార్జున - వర్మ రెండో షెడ్యూల్ మొదలయ్యేవరకు డౌట్. ఈ విషయం మీద నాగ్ ఎలా స్పందిస్తాడో అనేది చూడాలి.